టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది లెక్కకు మిక్కిలి సినిమాలో రిలీజ్ అయ్యాయి. కానీ.. ఆ సినిమాల్లో సక్సెస్ సాధించిన సినిమాలన్నీ అంటే వేళ్ళపై లెక్కపెట్టి చెప్పేయొచ్చు. కాగా.. రిలీజ్ అయిన సినిమాల్లో మెజార్టీ సినిమాలు అంచనాలను మించి సక్సెస్ సాధించడంతోపాటు.. కలెక్షన్ల పరంగా రికార్డులను క్రియేట్ చేశాయి. వాటిలో మహేష్ బాబు గుంటూరు కారం, బన్నీ పుష్ప 2, ప్రభాస్ కల్కి 2898 ఏడి, ఎన్టీఆర్ దేవర సినిమాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ నలుగురు.. ఈ ఏడాది సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేశారు.
ఇక వీరి సినిమాలు కూడా.. కలెక్షన్ల పరంగా సత్తా చాటాయి. గుంటూరు కారం మినహా మిగతా మూడు సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన సంగతి తెలిసిందే. అయితే.. 2024 రియల్ విన్నర్ ఎవరనే ప్రశ్న ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. దీనికి ఎక్కువగా ప్రభాస్ అనే సమాధానం వినిపిస్తుంది. ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర.. సంచలనం సృష్టించాడు కూడా. భారీ రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే కల్కి రికార్డును పుష్ప 2 బ్రేక్ చేయడం చాలా సులభం అంటూ బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే పుష్ప 2 సినిమాకి పూర్తి హిట్‌టాక్ కూడా రాలేదు.
ఇక ఈ రెండు సినిమాల తర్వాత.. దేవర మూడో స్థానాన్ని దక్కించుకుంది. దేవరకు రూ.550 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. గుంటూరు కారం సినిమాకు రూ.200 కోట్లకు పైగా వస్తువులు దక్కాయి. అలా ప్రస్తుతం రిలీజ్ అయి రిజల్ట్ అందుకున్న సినిమాలతో ఈ ఏడాది రియల్ విన్నర్ గా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ఇక పుష్ప 2.. ఫుల్ రన్ పూర్తయిన తర్వాత కానీ.. ఈ ఏడాది అసలు వినరెవ్వరో తెలియదు. కాగా.. వచ్చేయడాది 2025లో ఎక్కువగా పాన్ ఇండియా లెవెల్ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల్లో ఎన్ని సినిమాలు సక్సెస్ అందుకుంటాయో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.