పుష్ప 2 మొదటి రోజు నుంచి బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ కలెక్షన్స్ తోనే ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టి సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన పుష్పరాజ్.. దేశంలోనే హైయెస్ట్ వసూళ్లు సాధించిన మొదటి సినిమాగా సంచలనం సృష్టించింది. ఇక.. ఈ సినిమా రెండవ రోజు కలెక్షన్ల విషయంలో కాస్త డల్ అయినట్లు అనిపించినా.. ఏకంగా రూ.150.5 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. అలా.. రెండు రోజులకు కలిపి ఏకంగా రూ.449 కోట్లు రాబట్టిన పుష్పరాజ్ ఇప్పుడు నార్త్‌లోను ఓ రేంజ్‌లో దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.
మొదటి రోజు అక్కడ రూ.72 కోట్ల నెట్ వసూళ్ళు రాగా.. రెండో రోజు కూడా ఇంచుమించు ఇదే రేంజ్ లో కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక మూడో రోజు.. ఏకంగా రూ.74 కోట్ల కలెక్షన్లను సాధించి మరోసారి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. కేవలం హిందీలో మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా ఒక తెలుగు సినిమాకు నెట్ వసూలు రావడం అంటే ఇది సాధారణ విషయం కాదు.
ఇకపై రిలీజ్ అయ్యే స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇది ఓ స్ట్రాంగ్ మార్జిన్ గా ఉండనుంది. ఇక ముందు ముందు.. పుష్పరాజ్ తన సినిమాతో ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాడు.. ఏ రేంజ్ లో కలెక్షన్లు కలగొడతాడు.. వేచి చూడాలి. ప్రస్తుతం వీకెండ్ హవా కొనసాగుతున్న క్రమంలో పుష్ప 2 కలెక్షన్లు మరింత పుంజుకునే అవకాశం ఉంది. నేటితో ఈ సినిమా రప్ప రప్ప అంటూ మరిన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మూడు రోజుల్లోనే నార్త్‌లో ఏకంగా రూ.205 కోట్ల కలెక్షన్లు సాధించిన మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.