టాలీవుడ్ ఇండస్ట్రీలోకి 80, 90 లలో స్టార్ హీరోయిన్గా రాణించిన ఎంతోమంది ముద్దుగుమ్మలు.. తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీకి దూరమయ్యిన వారు చాలామంది ఉన్నారు. వాళంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు..? ఏం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ కూడా చాలామందికి తెలియదు. అలా 80లలో స్టార్ హీరోయిన్గా రాణించి ఇండస్ట్రీకి దూరమైన వారిలో అలనాటి హీరోయిన్లు జయప్రద నుంచి రతి వరకు చాలామంది ఉన్నారు. వారంతా ఇప్పుడు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. తెలుసుకోవాలని ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ఒకసారి ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం.
జయప్రద:
ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా వెలుగు వెలిగిన జయప్రదకు.. తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పటి టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు రాజకీయాల్లోను యాక్టివ్ గా లేరు. త్వరలోనే సినిమాలకు రీఎంట్రి ఇవ్వాలనే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం.
అమృత సింగ్:
బాలీవుడ్ స్టార్ బ్యూటీగా ప్రస్తుతం ఓ వెలుగు వెలుగుతున్న సారా అలీ ఖాన్ తల్లి.. అమృత సింగ్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇమే సైఫ్ అలీ ఖాన్ ను వివాహం చేసుకొని.. విడాకుల తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.
మీనాక్షి శేషాద్రి:
అలనాటి స్టార్ హీరోయిన్లలో ఒకరైన మీనాక్షి శేషాద్రి.. అప్పట్లో ఎంతో మంది ప్రేక్షకులను తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఇక మీనాక్షి 1995లో అమెరికాకు వెళ్లి ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ని వివాహం చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయింది.
పూనామ్ ధిల్లాన్
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు పలు సినిమాల్లో తల్లి పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది. బిజెపికి సానుభూతిపరురాలుగాను వ్యవహరిస్తుంది.
పద్మిని కొల్హాపురే:
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో నటించిన పద్మిని కొలహపూరే.. ప్రస్తుతం పలు రియాలిటీ షోలలో మెరుస్తున్నారు. కొన్ని సినిమాల్లో తల్లి పాత్రల్లోనూ నటిస్తున్నారు.
మందాకిని
ఎంతోమంది ఆడియన్స్‌ను తన అందం, అభినయంతో ఆకట్టుకున్న అలనాటి స్టార్ బ్యూటీ మందాకిని. ఈమె పేరు మాఫియా డాన్ ఇబ్రహీంతో ముడి పడడంతో.. ఇండస్ట్రీ నుంచి దూరమైంది. ఒక టిబెటన్ వైద్యుడిని వివాహం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో లీడ్ చేస్తుంది.
ఫర్హా నాజ్:
సీనియర్ స్టార్ హీరోయిన్ టబు సోదరి ఫర్హా నాజ్ కూడా.. ఒకప్పుడు హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అయితే ఫర్హా తర్వాత పెళ్లి చేసుకునే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు పూర్తి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.
రతి అగ్నిహోత్రి:
ఒకప్పటి సీనియర్ స్టార్ హీరోయిన్ రతి అగ్నిహోత్రి.. ప్రస్తుతం సినిమాల్లో తల్లి పాత్రల్లో నటిస్తూనే.. అడపదడప బాలీవుడ్ సినిమాల్లోనూ మెరుస్తుంది.