పుష్ప 2 మేక‌ర్స్‌కు దిమ్మ తిరిగే షాక్‌.. యూట్యూబ్‌లో ఫుల్ మూవీ స్ట్రీమింగ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. రిలీజ్ కు ముందు విపరీతమైన అంచనాలు నెలకొన్న ఈ సినిమా.. ప్ర‌స్తుతం అదే రేంజ్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఫస్ట్ డే ఏకంగా రూ.294 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి పాన్ ఇండియా లెవెల్ లోనే అత్యధిక కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా.. అత్యంత వేగంగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించాన‌ సినిమా గాను రికార్డులు సృష్టించింది.

Pushpa 2: The Rule (2024) - Movie | Reviews, Cast & Release Date -  BookMyShow

అలా పుష్పరాజ్‌ రపరప రికార్డులు క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న నేపథ్యంలో.. మేకర్స్ కు షాక్‌ల‌పై షాక్‌లు తగులుతున్నాయి. పుష్ప 2 విడుదలైన కొద్ది గంట‌ల‌కే పలు ఆన్లైన్ సైట్లలో పూర్తి మూవీ లీక్ అయిపొగా అప్పటికే మేకర్స్ బిగ్ షాక్ లో పడిపోయారు. కాగా తెలుగు రాష్ట్రాల‌కంటే పుష్ప సినిమాను నార్త్ ఆడియ‌న్స్ ఓన్ చేసుకుని ఆద‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే ఈ క్ర‌మంలోనే బాలీవుడ్‌లో తెలుగొడి స‌త్త చాటుకున్నాడంటూ వార్త‌లు తెగ వైర‌ల్ అయ్యాయి.

అంతే కాదు బాలీవుడ్ బాద్‌షా షారుక్ జ‌వాన్ రికార్డ్‌లు కూడా అక్క‌డ ఫుష్ప 2 బ్రేక్ చేసి అంద‌రిని ఆశ్య‌ర్య‌ప‌రిచింది. అలా క‌లెక్ష‌న్ల ప‌రంగా నార్త్‌లో స‌త్తా చాటుతున్ క్రమంలో మేక‌ర్స్‌కు అక్క‌డ బిగ్ షాక్ త‌గిలింది. తాజాగా యూట్యూబ్లో కొందరు.. హిందీ వర్షన్ ఫుల్ మూవీ స్ట్రీమింగ్ అయ్యేలా చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై మేకర్స్ ఇప్పటివరకు స్పందించలేదు. ఇక త్వరలోనే సైబ‌ర్‌ క్రైమ్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసి.. తగిన చర్యలు మేకర్స్ తీసుకోబోతున్నారని సమాచారం.