ప్రస్తుతం మంచు మొహన్ బాబు.. శంషాబాద్ సమీపంలో ఇల్లు కట్టుకొని అక్కడే నివాసం ఉంటున్నాడు. జూబ్లీహిల్స్ ఇంటిని మంచు లక్ష్మికి ఇచ్చేయగా.. మంచు విష్ణు కూడా తండ్రితో కలిసి శంషాబాద్ లోనే ఉంటున్నారు. మనోజ్ మాత్రం కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. ఇటీవల కాలంలో వీరి మధ్య సంబంధాలు సరిగ్గా లేవని.. అందుకే మనోజ్ కుటుంబానికి దూరమయ్యాడంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కాగా ఇటీవల మోహన్ బాబు యూనివర్సిటీలో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాడని.. వేధింపులకు పాల్పడుతున్నాడని.. సలు ఆరోపణలు వినిపించాయి. ఈ క్రమంలో మనోజ్ దీనిపై భిన్నంగా రియాక్ట్ అయ్యాడు. తనకు బాధ్యత ఉందన్నట్లు ఆయన కామెంట్స్ చేశారు.
యూనివర్సిటీలో తనకు భాగం ఉందని ఆయన భావిస్తూ అప్పుడు అలాంటి కామెంట్స్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇక అలాంటిదేమీ లేదంటూ మంచు విష్ణు, మోహన్ బాబు వాదిస్తూ ఉండడం వల్ల.. అసలు సమస్య మొదలయిందని చెబుతున్నారు. మోహన్ బాబు ఇప్పటికే ఆస్తుల్లో ఎవరి భాగాలు వారికి పంచేశారట. హైదరాబాద్ శివారులోని ఓ రిజిస్ట్రేషన్ ఆఫీసులో భాగాలు.. ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగిందని సమాచారం. అయితే మోహన్ బాబు కుటుంబానికి ఎక్కువగా ఆదాయం తెచ్చి పెట్టేవి విద్యాసంస్థలు. మిగతావి ఖర్చులు తప్ప ఆదాయాలే ఉండవు. ఈ క్రమంలోనే యూనివర్సిటీ, విద్యా సంస్థలను మనోజ్ కు కాకుండా అన్యాయం చేశారని చెప్తున్నారు.
దాంతో హక్కు కోసం మనోజ్.. మోహన్ బాబుతో పోరాడుతున్నాడట. దీని గురించే మోహన్ బాబు నివాసంలో శనివారం రాత్రి చర్చలు జరిగాయని.. మాట మాట పెరగడంతో మోహన్ బాబు తన అనుచరులో ఒకరైన వినయ్ అనే వ్యక్తిని ప్రేరేపించి మనోజ్ ని కొట్టించారని చెబుతున్నారు. దీంతో మనోజ్ పోలీసులకు ఫోన్ చేసి తండ్రి.. తన పై దాడి చేశాడంటూ ఆరోపణలు చేశారు. పోలీసులు రావడంతో.. తమ పైన మనోజ్ దాడి చేశారని మోహన్ బాబు వెల్లడించాడు. అయితే విషయం పోలీసుల వరకు వెళ్తే కేసులు వరకు వెళితే అందరికీ ఇబ్బంది అవుతుంది. మాట్లాడుకుందాం అని మనోజ్ ను కన్విన్స్ చేసి అంతా హ్యాపీసేనని పోలీసులకు చెప్పి పంపించేసారట. కుటుంబ వివాదం కావడంతో పోలీసులు ఎక్కువగా జోక్యం చేసుకోలేదని సమాచారం. అయితే ఈ వివాదాలు ఇంతటితో ఆగే అవకాశం లేదని.. మంచు మనోజ్ ఆసుపత్రిలో చేరడం తదుపరి వ్యూహాన్ని ఖరారు చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.