టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో రికార్డులను బ్రేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే కాదు అట్టు నార్త్ లోను.. ఇటూ ఓవర్సీస్ లోను కలెక్షన్ల పరంగా ఊచకోత కోస్తున్నాడు పుష్పరాజ్. ఇండియన్ సినిమాలలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా బాహుబలి 2 రికార్డ్ ను క్రియేట్ చేస్తే.. దానిని త్రిబుల్ ఆర్ బ్రేక్ చేసింది. ఈ సినిమా తర్వాత ఎన్నో సినిమాలు బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ తరికెక్కిన ఈ రేంజ్ లో రికార్డ్ టచ్ చేయడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు. కానీ.. అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2తో ఆ రికార్డును బ్రేక్ చేశాడు. ఎకంగా ఫస్ట్ డే కలెక్షన్స్‌తోనే రూ.294 కొట్లు కొల్లగొట్టి రాబోయే సినిమాలకు భారీ మార్జన్‌ను సెట్ చేసి పెట్టాడు.
ప్రస్తుతం పుష్ప 2 సృష్టించిన ఈ బిగ్ టార్గెట్‌ని ఏ సినిమా బీట్ చేస్తుందో.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే అంచనాలు ఆడియనస్‌లో నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలోనే పుష్పరాజ్ రికార్డును కొల్లగొట్టడం అంత సులువుకాదని.. ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసే క్యపాసిటి మాత్రం.. రాబోయే సినిమాల్లో ఒకే ఒక్క సినిమాకి ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న బిగెస్ట్ మల్టీ స్టారర్ వార్ 2.
భారీ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాపై ప్రస్తుతం ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక చివరిగా తారక్ సోలోగా వచ్చి దేవరతో ఏకంగా రూ. 500కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టాడు. మరోపక్క వార్ 2 పై అటు హిందీ, ఇటూ తెలుగు ఆడియన్స్‌లో కూడా ఆకాశమే హద్దు అన్న రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక గతంలొ వచ్చిన వార్ 1 మూవీ ఓవర్సిస్‌లో కూడా భారీ వసూళ్ళ కొట్టగొట్టింది. ఈ క్రమంలోనే అక్కడ ఆడియన్స్ కూడా వార్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్ప 2 కొల్లగొట్టిన హైయెస్ట్ కలెక్షన్ల రికార్డ్ వార్ 2 బ్రేక్ చేస్తుందని.. ఓపెనింగ్స్ తోనే ఫస్ట్ డే కలెక్షన్స్ తో వార్ 2 బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ చేయడం ఖాయం అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోస్ట్ అవైటెడ్ సినిమాగా వచ్చే ఏడాది స్వతంత్ర దినోత్సవం కానుకగా ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.