కంచుకోటలో బాలయ్య డాకు మహారాజ్.. ఫస్ట్ షో ఆ థియేటర్‌లోనే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఓ పక్కన రాజకీయాల్లోను.. మరో పక్క సినిమాల్లోనూ రాణిస్తూనే ఇంకో పక్కన బుల్లితెరపై కూడా హోస్ట్‌గా స‌క్స‌స్ ఫుల్‌గా రాణిస్తున్నాడు బాలయ్య‌. ఇక ప్రస్తుతం బాల‌య్య‌కు లక్కీ టైం నడుస్తుంది. వరుస ప్లాప్ లతో శతమాత‌మవుతున్న క్రమంలో.. బోయపాటి శ్రీ‌ను డైరెక్షన్‌లో తెర‌కెక్కిన అఖండతో బ్లాక్ బ‌స్టర్ అందుకున్న బాలయ్య.. ఈ సినిమా తర్వాత ఫ్లాప్ అన్నది లేకుండా దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య నుంచి తన 109వ సినిమా సంక్రాంతి బరిలో రంగంలోకి దిగనుంది. డాకు మహారాజ్ టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుక జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

NRIPage | Box Office | Movie News | 'NBK 109' New Film Title Revealed:  Daaku Maharaj

ఇక ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన టైటిల్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అఖండ బ్యూటీ ప్రగ్యా జైశ్వ‌ల్ కనిపించనుంది. శ్రద్ధ శ్రీనాథ్ మరో కీలక పాత్రలో మెరవనుంది. ఇక.. గత కొంతకాలంగా వరుసగా బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న థ‌మన్‌.. ఈ సినిమాకు కూడా సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఇక చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాబి.. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Bramaramba Theatre A/C Dts Kukatpally Hyderabad | భ్రమరాంబ థియేటర్ |

సూర్యదేవర నాగ వంశీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నఈ సినిమా ఫస్ట్ షో బాలయ్య కంచుకోటగా మారిన ఓ థియేట‌ర్‌లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత‌కి ఆ ధియేట‌ర్ ఏదో కాదు హైదరాబాద్‌లోని భ్రమరాంబ థియేటర్. అక్క‌డే డాకు మ‌హ‌రాజ్ ప్రదర్శించేందుకు సిద్ధం చేస్తున్నారట మేక‌ర్స్‌. పుష్ప 2 దెబ్బకు.. తెలంగాణ బెనిఫిట్ షోలు బంద్ అయిన సంగతి తెలిసిందే. అయితే జనవరి 11వ తేదీన సెకండ్ షోను ముందుగా బాలయ్య సినిమాలకు అడ్డా అయినా భ్ర‌మరాంభ‌ థియేటర్లో ప్రదర్శించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఏపీలో మాత్రం 11వ తేదీ అర్ధరాత్రి దాటినప్పటి నుంచి ప్రీమియర్ షోలు ప‌డ‌తాయి. తెలంగాణలో బెనిఫిట్ షోలకు అనుమతులు లేకపోవడంతో.. 12వ తేదీ ఉదయం 5 గంటలు దాటిన తర్వాత నుంచి వరుస షోలు ప‌డ‌నున్నాయి.