బాహుబలి టూ పుష్ప.. టాలీవుడ్ హిట్ సీక్వెల్స్ లిస్ట్ ఇదే..

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తుంది. అయితే పుష్ప 2 కంటే ముందు టాలీవుడ్ సినిమాలు ఎన్నో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బాహుబలి టు పుష్ప టాలీవుడ్ లో తెరకెక్కి బ్లాక్ బ‌స్టర్లు గా నిలిచిన హిట్ సీక్వెల్స్ లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

Pushpa 2 or Pushpa 1 which one is better ?? : r/IndianCinema

పుష్ప

మొదట 2021లో పుష్ప సినిమా రిలీజై బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా పుష్ప 2 ది రూల్ వ‌చ్చి పుష్పరాజ్ స్టామినా చూపిస్తుంది.

Which Baahubali film do you prefer? : r/tollywood

బాహుబలి

2017లో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో బాహుబలి ఫస్ట్ పార్ట్‌ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే దీనికి సిక్వల్గా 2017 లో బాహుబలి 2 రిలీజ్ అయి సంచలన రికార్డులను క్రియేట్ చేసింది.

No clarity on 'Karthikeya 2' female lead

కార్తికేయ

ఇక నిఖిల్ హీరోగా వ‌చ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో కార్తికేయ ఒకటి. 2014లో రిలీజ్ అయిన ఈ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2.. 2022లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజై బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచింది.

Venkatesh's Drushyam 2 Review: Faithful and Gripping - Telugu360

దృశ్యం

విక్టరీ వెంకటేష్ హీరోగా.. 2014లో దృశ్యం తెరకెక్కి మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే సినిమాకు సీక్వెల్ గా 2021లో దృశ్యం 2 సినిమా రూపొందించారు. ఈ సినిమా అంతకుమించిన బ్లాక్ బస్టర్.

Tillu Square' gets a new release date; film to hit screens on Mar 29

డీజే టిల్లు

2022లో వచ్చిన డీజే టిల్లు సర్ప్రైసింగ్ హిట్. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా టిల్లు స్క్వేర్ రూపొంది. ఏకంగా రూ.100 కోట్ల వసూళ్లతో బ్లాక్ బాస్టర్ హిట్గా రికార్డ్ సృష్టించింది.

Mathu Vadalara 2

మత్తు వదలరా

2019లో తెర‌కెక్కిన మత్తు వదలరా హిట్. కాగా.. ఈ ఏడది ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన మత్తు వదలరా 2.. అంతకు మించిన బ్లాక్ బస్టర్ బొమ్మ.

Maa Oori Polimera 2 Review

మా ఊరి పొలిమేర

2021లో.. మా ఊరి పొలిమేర అనే హారర్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీలో రిలీజై హిట్ కాగా.. సీక్వెల్ ను థియేటర్లలో రిలీజ్ చేశారు. మా ఊరి పొలిమేర 2 .. కూడా హారర్ మూవీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

హిట్

మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ రూపొందిన హిట్.. 2020లో మంచి సక్సెస్ అందుకోగా.. ఈ సినిమాకు సీక్వెల్ హిట్ 2.. వ‌చ్చి 2022లో అంతకు మించిన బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

F3 (Telugu) 2022 on OTT - Cast, Trailer, Videos & Reviews

ఎఫ్2

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబోలో తెరకెక్కిన కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్2. మల్టీ స్టార‌ర్ గా రూపొందిన ఈ సినిమా.. 2019లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. దీనికి సీక్వెల్ గా f3 సినిమా 2022లో రిలీజై మరోసారి హిట్ గా నిలిచింది.