సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుస్ప 2 ఎలాంటి రిజల్ట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాకి హైలైట్ గా నిలిచిన జాతర ఎపిసోడ్ ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమా హిట్ అవ్వడానికి మెయిన్ కంటెంట్ కూడా 50 నిమిషాల ఈ జాతర ఎపిసోడ్ అనడంలో అతిశయోక్తి లేదు. రష్మిక పెర్ఫార్మెన్స్ అయితే పిక్స్ లెవెల్ లో ఉంది. ఇలాంటి క్రమంలో పుష్ప 2కి ముందనుకున్న క్లైమాక్స్ అది కాదంటూ టాక్ నడుస్తుంది.
క్లైమాక్స్ వేరేగా అనుకున్నారట. కానీ.. సమయానుకూలంగా కథకు తగ్గట్టుగా మెల్లమెల్లగా సన్నివేశాలను మారుస్తూ క్లైమాక్స్ ను పూర్తిగా మార్చేసారని తెలుస్తుంది. అంతేకాదు.. పుష్ప 2 కోసం.. ఏకంగా మూడు సీన్స్ అనుకున్నా లాస్ట్‌లో అవేవి వర్కౌట్ కాలేదని.. దాంతో మొత్తం క్లైమ్యాక్స్ మార్చేశాడని సమాచారం. నిజానికి సినిమాలో మెయిన్ విలన్ భన్వర్ సింగ్ షేకావత్ ఉన్నాడు. భన్వర్ సింగ్ షేకావత్ చనిపోయిన తర్వాత దాక్షాయని, మంగళం సీను కూడా కామ్ అయిపోతారు. ఇక పుష్పరాజ్ సిండికేట్ హెడ్గా కొనసాగుతాడు. దీంతో ఎండ్ కార్డు పడాలని క్లైమాక్స్ ప్లాన్ చేసుకున్నాడట సుకుమార్.
అది చేయలేదు. ఇక సినిమాలో చూపించినట్లు పుష్ప రాజ్‌కి ఇంటి పేరు వచ్చేలా.. కానీ వేరే ఫైట్ సీన్ తో ఇది జరిగేలా క్లైమాక్స్ ను భావించారట. అయితే అది కూడా కాకుండా మరో విధంగా క్లైమాక్స్ ను ఎండ్ చేశారు. మరొకటి భన్వర్ సింగ్ షెకావత్ పుష్పపై కోపంతో పుష్పని చంపకుండా.. పుష్ప చేసే సంగ్లింగ్ ను ఆపేస్తూ.. చేసే ఒక్క దాడిలో శ్రీవల్లి చనిపోవడం.. అప్పటికే శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయి ఉండటంతో ఆ కోపంతో బన్నీ.. షెకావత్ పై పగ తీర్చుకోవాలని చూడటం.. కానీ రెడ్ హ్యాండెడ్ గా పుష్పరాజ్ దొరికిపోయి అక్కడ నుంచి తప్పించుకొని అడవుల్లోకి పారిపోయేలా క్లైమాక్స్ అనుకున్నారు. అయితే ఈ మూడు కూడా పుష్ప 2 సినిమాలో చూపించలేదు సుకుమార్ .