తండ్రి లేని ఆ హీరోయిన్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న బాలయ్య.. కోడల్ని చేసుకుంటాడా..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణకు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి క్రెజ్‌, పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే బాలయ్య అంటే ఆయనకు చాలా కోపం ఎక్కువ, పెద్ద కోపిష్టి అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఏమాత్రం చిరాకు వచ్చిన చేతికి పని చెప్తాడు అని.. సన్నిహితులు కూడా చెప్తూ ఉంటారు. పబ్లిక్ లో అభిమానులను బాలయ్య కొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక తాజాగా హీరోయిన్ అంజలిని వేదికపై వెనక్కి తోయడం పెద్ద వివాదంగా మారింది. నేషనల్ మీడియా కూడా మహిళల పట్ల స్టార్ హీరో అనుచిత ప్రవర్తన అంటూ ఎన్నో కథనాలను రాసుకొచ్చింది. అలాంటి క్రమంలో అంజలి దీనిపై రియాక్ట్ అవుతూ బాలకృష్ణకు నాతో చాలా చనువుంది అందుకే ఆయన నన్ను తోసారు. ఆయనేమీ నాతో దురుసుగా ప్రవర్తించలేదు అంటూ స్వయంగా క్లారిటీ ఇచ్చింది.

Sreeleela Teaches 'Kissik' Step To Balayya

ఇదంతా బాలయ్యలో ఉండే ఒక కోణం అయితే.. బాలయ్యను చాలా దగ్గర నుంచి చూసేవారికి మాత్రమే ఆయనలోని అసలైన కోణం తెలుస్తుంది. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని.. మనుషులను ఆయన బాగా నమ్ముతాడు.. ఎవరినైనా నమ్మితే, ఇష్టపడితే వారి కోసం ఏం చేయడానికైనా బాలయ్య వెనకాడరట. ఈ క్రమంలోనే బాలయ్య ఓ యంగ్ హీరోయిన్ పెళ్లి బాధ్యతలను తీసుకున్నాడు. తనతో భగవంత్ కేసరి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్న శ్రీ లీలకు తానే పెళ్లి చేస్తానంటూ బాలకృష్ణ వెల్లడించారు. అన్‌స్టాప‌బుల్‌ ఎపిసోడ్ లో స్పెషల్ గెస్ట్ గా శ్రీ లీల, నవీన్ పోలిశెట్టి వచ్చే సందడి చేశారు. ఇక వీరి సరదా సంభాషణలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఇక ఇందులో భాగంగా బాలయ్య.. శ్రీలీల నాకు కూతురు లాంటిది.. ఆమెను చూస్తుంటే నా పిల్లలే గుర్తుకొస్తారంటూ కామెంట్స్ చేశాడు.

Balakrishna-Mokshagna-Sreeleela-1 - Telugu Lives - Telugu Latest News

శ్రీలీలకు ఒక తండ్రిగా.. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే బాధ్యత నాది అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. భగవంత్ కేసరి మూవీలో శ్రీ లీల.. బాలయ్య కూతురు వరసలో కనిపించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ షూటింగ్ టైంలో వీరి మధ్య బాండింగ్ బలపడిందని.. మోక్షజ్ఞ మూవీలో శ్రీ‌లీలనే హీరోయిన్గా రాబోతుందంటూ వార్తలు కూడా వినిపించాయి. ఇక ప్రస్తుతం మోక్షజ్ఞకు భార్యగా.. తన ఇంటి కోడలుగా శ్రీ‌లీల‌ను తెచ్చే ఆలోచన కూడా బాలయ్య మదిలో ఉందేమో అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ‌లీల పుట్టింది అమెరికా అయినా.. తర్వాత తల్లిదండ్రుల మధ్యన వివాదం కారణంగా తల్లితో పాటు బెంగుళూరు వచ్చేసి ఇక్కడే సెటిల్ అయ్యారు. ఇక శ్రీ‌లీల‌ను తల్లి ఎంతో క్రమశిక్షణతో పెంచార‌ని.. ఇప్పుడు నేను ఇంత ఎత్తుకు ఎదగడానికి కారణం ఆమె తల్లినంటూ టాక్ షోలో శ్రీ లీల తన తల్లి గురించి ఎమోషనల్ అయింది. కాక ప్రస్తుతం శ్రీలీలకు తన దగ్గర ఉండి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తానంటూ బాలయ్య చేసిన కామెంట్స్ నెటింట హ‌ట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి.