తాజాగా సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్.. హరికథ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశారు. ఆయన ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రజంట్ జనరేషన్ హీరోల గురించి.. వారి క్యారెక్టర్జేషన్ గురించి వెల్లడించారు. హీరో మీనింగ్ ఏ మారిపోయిందని.. ఇటీవల కాలంలో వస్తున్న సినిమాల్లో హీరోల క్యారెక్టర్జన్లో ఎన్నో మార్పులు వస్తున్నాయని.. నెగిటివ్ రోల్స్ ని కూడా జనాలు ఆదరిస్తారనే ఉద్దేశంతో అలాంటి సినిమాలు తీస్తున్నారని ఆయన చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాపై ఆయన ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేశారు. చందనం దుంగల్ని దొంగతనం చేసే దొంగ.. వాడో హీరో అంటూ తాజాగా రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్ గా మారాయి.
రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. కలియుగంలో ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తుంటే.. నిన్నకాక మొన్నే ఓ సినిమా వచ్చింది. వాడెవడో చందనం దుంగలు దొంగ.. ఒక హీరో. అసలు హీరోల మీనింగే మారిపోతుంది. అయితే నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే.. నేను 48 సంవత్సరాలుగా సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి క్యారెక్టర్స్‌లోనే డిఫరెంట్ రోల్స్‌లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నా.. లేడీస్ టైలర్ లో హీరో ఒక సన్నాసి. అప్పుల అప్పారావు, పేకాట పాపారావు సినిమాల్లో వాడు హీరోనా.. ఏప్రిల్ ఒకటి విడుదలలో హీరో ఒక దొంగ.
కానీ.. సమాజంలో మన చుట్టూ మనతో పాటు మన పక్కనే ఉన్న అలాంటి క్యారెక్టర్స్ తీసుకొని హీరోగా కనిపించి ఇంతకాలం మిమ్మల్ని ఆదరించా అంటూ రాజేంద్రప్రసాద్ చెప్పకొచ్చాడు. ఇప్పుడు హరికథ సినిమాలోనూ మంచి పాత్రలో కనిపించబోతున్నానా.. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ చేయాల్సిన పాత్ర నాకు దక్కడం సంతోషంగా ఉందంటూ హరికథలు చెబుతూ జీవితాంతం.. హరినామస్మరణ చేసే రంగాచారి పాత్రలో కనిపించబోతున్నానని వెల్లడించాడు. అయితే హీరోల క్యారెక్టరైజేషన్ గురించి చెప్తూ.. రాజేంద్రప్రసాద్ ఉదాహరణగా పుష్ప క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడటం హట్ టాపిక్‌గా మారింది.