చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్… అదిరిపోయిందిగా…!

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాలో అంజలి మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌పై ఆడియన్స్‌లో విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ అప్డేట్ ఏదైనా వస్తే బాగుండని మెగా అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

అయితే ఇప్పటివరకు పలు ప్రమోషనల్ కంటెంట్ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ మాత్రం రిలీజ్ చేయలేదు మేకర్స్. దీంతో టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. కాగా మేకర్స్.. టీజర్ కు సంబంధించిన అదిరిపోయే అప్డేట్‌ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. టీజర్ లేదా నెక్స్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు సరికొత్త అప్డేట్ తో కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు. అతి త్వరలో సినిమా నుంచి టీజర్ రానుందని.. ఈ పోస్టర్‌లో వెల్లడించారు.

Game Changer Teaser: Makers keep Ram Charan fans in limbo | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

ఇక ఈ పోస్టర్‌లో చరణ్ కలెక్టర్‌లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక జనం అంతా వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నట్లుగా ఈ పోస్టర్లో ఉంది. మొత్తానికి అయితే ఎట్టకేలకు మేకర్స్‌ ఆడియన్స్ కు కావలసిన అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తుండగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, రవిబాబు తదితరులు కీలకపాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా.. వచ్చేయడానికి సంక్రాంతి బరిలో జనవరి 10న గ్రాండ్గా రిలీజ్ కానుంది.