టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. ఆరుపదల వయసు దాటిన ఎప్పటికీ అదే ఎనర్జీతో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నేటి తరం యుత్‌ను సైతం ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ అందుకు అంటున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సైంధవ్ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయి డిజాస్టర్‌గా నిలిచింది. ఇక వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి తో ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. గతంలో వీరి కాంబోలో ఎఫ్2, ఎఫ్3 సిరీస్‌లు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. మళ్ళీ వీరి కాంబోలోనే ఈ సినిమా తెరకెక్కుతుండడంతో ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ లోనూ సినిమా పై భారీ హైప్ నెలకొంది.
ఇక ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్‌గా.. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా వ్యవహరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని టాక్. అయితే గేమ్ ఛేంజర్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. అంతేకాదు గేమ్ ఛేంజర్‌తో పాటు అనిల్ రావిపూడి – వెంకటేష్ కాంబో మూవీని కూడా.. దిల్ రాజా ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే సంక్రాంతికి రిలీజ్ కానున్న వెంకటేష్ మూవీని.. డిసెంబర్ 20న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా తర్వాత వెంకటేష్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కూడా లైన్లో పెట్టుకున్నాడని సమాచారం. ఇంతకీ ఆ డీటెయిల్స్ అంటే ఒకసారి తెలుసుకుందాం. తమిళ్ డైరెక్టర్ టి.ఎన్.సంతోష్ ఇటీవల వెంకటేష్ ని కలిసి ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథను వినిపించాడట.
ఆ కథ వెంకటేష్ కు వెంటనే నచ్చేయడంతో.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన సొంత బ్యానర్స్ శ్రేష్ఠా మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. అంతేకాదు సినిమాలో వెంకటేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించినాడని.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటించినట్లు సమాచారం. ఇక వెంకటేష్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటించి చాలా కాలం అయింది. అప్పట్లో ఘర్షణ సినిమాతో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వెంకటేష్.. తర్వాత అంత సీరియస్ రోల్లో ఎప్పుడు నటించలేదు. ఇంత కాతం తర్వాత మరోసారి ఘర్షణ తరహా పవర్ ఫుల్ రోల్లో వెంకి కనిపించబోతున్నాడని టాక్. అతి త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేకర్స్ రిలీజ్ చేయనున్నారట. వచ్చేయడానికి జనవరి నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని.. రాబోయే రోజుల్లో ఈ ప్రాజెక్టు సంబంధించిన క్యాస్టింగ్ వివరాలు కూడా వెల్లడించనున్నట్లు టాక్.