నందమూరి నటసింహం బాలకృష్ణ.. మ్యాన్ అఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య యాక్షన్ సినిమాలకు క్యారాఫ్ అడ్రస్ గా నిలిచారు. ఇప్పటివరకు బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో ఎక్కడైనా ఒక్క ఫైట్ సీన్ అయినా కచ్చితంగా ఉండాల్సిందే. జీప్ పైకి లేచే సీన్స్, లేదంటే కత్తులు తిప్పడం, నరకడం లాంటిది ఎప్పుడు కామన్ గానే ఉంటాయి. కానీ.. బాలయ్య నటించిన ఒక సినిమాలో మాత్రం అసలు ఒక్క ఫైట్ కూడా లేకుండా తెరకెక్కి సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా మరేదో కాదు నారీ నారీ నడుమ మురారి.
1990 ఏప్రిల్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా.. బాలకృష్ణ 50వ సినిమాగా రూపొంది కలెక్షన్‌ల వర్షం కురిపించింది. యువచిత్ర బ్యానర్‌పై కె.నరసింహా నాయుడు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో.. శోభన, నిరోష హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, శారదా కీలక పాత్రలో నటించి మెప్పించారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌ని పక్కన పెట్టి.. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ హైలెట్ చేస్తూ బాలయ్య ఈ సినిమాలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో సినిమాకు టాలీవుడ్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. నారి నారి నడుమ మురారి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో బెల్లం చెర్రీ అనే ప్రాంతంలో మూవీ షూట్ ను పూర్తి చేశారు. ఇందులో ఒక ఫైట్ సీన్, ఒక డ్యాన్స్ స్టెప్ కూడా లేకుండా.. ఇంత భారీ సక్సెస్ సాధించడం బాలయ్య క్రియేట్ చేసిన ఓ రేర్ రికార్డు అనడంలో సందేహం లేదు. అల్లు రామలింగయ్య, బాబు మోహన్, అంజలి దేవి, రమాప్రభ తదితరులు ఈ సినిమాలో నటించి మెప్పించారు. తనికెళ్ల భరణి రైటర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఇక బాలకృష్ణ అంటేనే కత్తి పట్టినా.. డైలాగ్ చెప్పిన, తొడగొట్టిన థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది. అలాంటిది ఇవి ఏవి లేకుండా కూడా బాక్స్ ఆఫీస్ మొత్తమోగించిన బాలయ్య ఏకైక మూవీ నారి నారి నడుమ మురారి.