ఆ ముగ్గురు స్టార్ దర్శకులపై కన్నేసిన ప్రభాస్.. డార్లింగ్ ప్లానింగ్ అదుర్స్ అంటూ..

ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా అరడజన్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దాదాపు రెండేళ్ల బిజీ లైనప్‌ను సెట్ చేసుకున్నాడు. అయితే ప్రభాస్ తో సినిమాలు తెరకెక్కించాలని ఇప్పటికి ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తున్నారు. కానీ.. ఈ క్రమంలోనే ప్రభాస్ మరో ముగ్గురు స్టార్ హీరోలతో కొత్త ప్రాజెక్టులు త్వరలో ప్రకటించనున్నారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక‌ రాజ్యసభ మూవీని దాదాపుగా పూర్తి చేసిన డార్లింగ్.. నెక్స్ట్ ఫౌజీ, స్పిరిట్ సినిమాల షూట్ ప్రారంభించి వచ్చే ఏడాది చివరికి పూర్తిచేస్తే అవకాశం ఉందట. కల్కి 2, సలార్ 2 సినిమాలు.. రీషుట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ఈ క్రమంలోనే ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాల జాబితాలో ముగ్గురు స్టార్ డైరెక్టర్లపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. వాళ్లే అట్లీ, లోకేష్ కన‌గ‌రాజ్‌, ప్రశాంత్ వర్మ. ఇక ఈ ముగ్గురు డైరెక్టర్లలో ఎవరితో ప్రభాస్ సినిమా ప్రకటించిన ఫ్యాన్స్‌లోనూ విపరీతమైన బజ్‌ క్రియేట్ అవుతుంది.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్‌గా దూసుకుపోతున్న ప్రభాస్.. రెమ్యూనరేషన్ పరంగాను టాప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన పెళ్లి వార్తలపై కూడా అభిమానులు ఆసక్తి పెరిగింది. వచ్చే ఏడాదిలో అయినా ప్రభాస్ పెళ్లి కబురు వింటామేమో అనే ఆసక్తితో అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్న క్రేజ్ రీత్యా టాలీవుడ్ టాప్ బ్యానర్లు సైతం ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.