సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఎన్నో సినిమాలు రూపొందుతూనే ఉంటాయి. అందులో ఎక్కువగా ప్రేమ కథలు సక్సెస్ అందుకుంటాయి. పెద్ద సినిమా, చిన్న సినిమా అని తేడా లేకుండా కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు వాటిని ఆదరిస్తారు అనడానికి ఇటీవల ఎన్నో ఉదాహరణలు చూసాం. అలాగే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలన సక్సెస్ సాధించిన సినిమాల్లో గతంలో తెరకెక్కిన టెన్త్ క్లాస్ మూవీ ఒకటి. ఈ సినిమా యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. 2006లో రిలీజైన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా వచ్చి ప్రేక్షకుల్లో సక్సెస్ సాధించింది.
ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ పై.. వెంకట శ్యామ్ ప్రసాద్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో.. భరత్, శరణ్య ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. మిక్కీజే మేయర్ సంగీతం అందించిన ఈ సినిమాకు మ్యూజిక్ పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికి సినిమాని ఎంతో మంది ఆడియన్స్ ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన శరణ్య అందరి మనసులు ఆకట్టుకుంది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. చిన్న వయసులోనే హీరోయిన్గా ఈ సినిమా నటించిన శరణ్య ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి కచ్చితంగా అభిమానుల్లో ఉంటుంది. ఈ క్రమంలో తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
ఆమెను ఇప్పుడు చూస్తే అసలు గుర్తుపట్టలేరు. ఈ క్రమంలోనే అమ్మడి ఫొటోస్ చూసిన ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. ఏంటి.. టెన్త్ క్లాస్ హీరోయిన్ ఇలా మారిపోయింది అంటూ.. ఈమె నిజంగా టెన్త్ క్లాస్ హీరోయినేనా.. అసలు అలా లేదే అంటూ.. అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు కంటే ఎక్కువగా తమిళ్ లో సినిమాలో నటించిన శరణ్య 2014 వరకు వరుస సినిమాల్లో మెప్పించింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఈ క్రమంలో లేటెస్ట్ పిక్స్ వైరల్ అవడంతో అంతా ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ట్రెడిషనల్ గా క్యూట్ స్మైల్ తో శరణ్య ఫాన్స్ ను ఆకట్టుకుంటుంది.
View this post on Instagram