టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో దేవరా తెరకెక్కింది. జాన్వి కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెప్పించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ప్రిమీయర్ షోతో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు ప్రేక్షకులు సినిమాకు క్యూ కట్టారు. ఈ క్రమంలో సినిమా ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది.
ఇక తాజాగా తారక్.. దేవర, బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఒకసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజు కలెక్షన్ల షేర్లో బాహుబలి 2 రూ.3.50 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి మొదటి స్థానంలో నిలిచింది. కానీ.. తాజాగా రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర 16వ రోజున కలెక్షన్స్ తో ఆ రికార్డును బ్రేక్ చేసి మొదటి స్థానం దక్కించుకుంది. ఏకంగా రూ.3.65 కోట్ల వసూళ్ళను దక్కించుకొని రికార్డ్ సృష్టించింది. ఇక ఈ జాబితాలో దేవర, బాహుబలి 2 తర్వాత మూడో స్థానంలో హనుమాన్ ఉంది. రూ.3.21 కోట్ల కలెక్షన్లను సాధించింది. ఆర్ఆర్ఆర్ రూ.3.10 కోట్లు, ఎఫ్2 రూ.2.56 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డ్ సృష్టించింది.
గత నెల 27న రిలీజ్ అయిన దేవర తాజాగా రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. ఇక పాన్ ఇండియా లెవెల్లో తారక్ నుంచి వచ్చిన మొదటి సోలో సినిమాతోనే ఈ రేంజ్లో కలెక్షన్లు రావడం అంటే సాధారణ విషయం కాదు. దీన్నిబట్టి పాన్ ఇండియా లెవెల్లో తారక్‌కు ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికీ చాలాచోట్ల థియేటర్లలో ఫుల్ ఆక్యుఫెన్సీ తో దూసుకుపోతున్న దేవర.. ఫ్యూచర్లో మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.