చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకు వెళ్లి.. ఆయనకే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిన లెజెండ్రీ నటి ఎవరో తెలుసా..?

మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక చిరంజీవికి మొదటి నుంచి అందరితోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కొందరితో విభేదాలు కూడా ఉన్నాయి. ఇక చిరంజీవి ఎవరినైనా ఎంతో ఆత్మీయంగా నవ్వుతూ పలకరిస్తారు అహంలేని.. సింప్లిసిటీని మెయింటైన్ చేసే వ్యక్తిగా మంచి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. అలాంటి చిరంజీవి ఇంటికి పెళ్లి పిలుపులకని వెళ్ళిన ఒక స్టార్ హీరోయిన్.. ఆయనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట. అదేంటి పెళ్లి పిలుపులకు వెళ్లి వార్నింగ్ ఇవ్వడం ఏంటి.. అసలు దేని గురించి అనుకుంటున్నారా.. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. అలనాటి దిగ్గ‌జ న‌టులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి లాగే జమున కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల్లో సత్యభామగా ఆ పాత్ర‌కు అందం తెచ్చారు.

Curious silence of megastar Chiranjeevi

ఇక‌ జమున రాజమండ్రి ఎంపీగాను పాలిటిక్స్‌లో రాణించారు. ఇక జమున గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఏ విషయం అయినా ముక్కుసూటిగా నిర్మొహ‌మాటంగా చెప్పే ఈమె.. జెమినీ గణేషన్ లాంటి స్టార్ హీరోలకు కూడా అప్పట్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జమున.. చిరంజీవి గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. రాజకీయాల్లో రాణించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని.. సినిమాల్లో వాళ్ళు కూడా రాజకీయాలు చేయొచ్చు.. తప్పేమీ లేదు. అలాగే ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు నేను కూడా రాజకీయాల్లో రాణించం అంటూ వివ‌రించింది. ఎన్టీఆర్ సీఎంగా మిగతా వారంతా ఎంపీలుగా సక్సెస్ అందుకున్నం. అప్పట్లో రాజకీయాలకు.. ఇప్పుడు రాజకీయాలకు పొంత‌న లేదు. ఇప్పుడు రాజకీయాలు బాగా కమర్షియల్ మారాయి. కోటి రూపాయలు ఖర్చు చేసి రూ.20 కోట్లు సంపాదించే విధంగా జనం ఉన్నారు.

Chiranjeevi, Mahesh Babu, Jr NTR condole demise of veteran Telugu actor Jamuna – ThePrint – ANIFeed

చిరంజీవి గారి విషయంలో నేను చాలా బాధపడ్డా. రాజకీయాల్లో సినిమా వాళ్ళు రావద్దని నేను ఇప్పుడు చెప్తా. ఎందుకంటే కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో సినిమా వాళ్ళు నిలదొక్కుకోవడం చాలా కష్టం. చిరంజీవి గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారని ఓ సందర్భంలో తెలిసింది. నేను అప్పుడే నా కూతురు పెళ్లికి ఇన్వైట్ చేయడానికి అని వాళ్ళ ఇంటికి వెళ్ళా. చిరంజీవి గారిని చాలా ధైర్యంగా హెచ్చరించా. చిరు గారు మీకు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఉన్నారు. గొప్ప ఆర్టిస్ట్. దానిపైన ఫోకస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కుళ్ళు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇయ్యద్దు ఇబ్బంది పడతారు అని హెచ్చరించా. ఆయన నవ్వేసి ఊరుకున్నారు.. నా మాట వినకుండా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏం జరిగిందో చూసామంటూ జమున కామెంట్స్ చేసింది. కుళ్ళు రాజకీయాలను కడగడం సినిమా వాళ్లకు సాధ్యం కాదని చెప్పుకొచ్చింది. ప్రజలు కూడా అలా బతకాల్సిందే అంటూ జమున ఎమోషనల్ కామెంట్స్ చేసింది.