ఏపీలోని ఆ ఏరియాలో దేవర ఊచకోత.. ఆ సినిమాల కలెక్షన్లను తుక్కు తుక్కు చేసేసిందే..

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను సీడెడ్ కింగ్ అనడంలో ఎలాంటి సందేహాలు లేవు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ 13 ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ప్లాప్‌టాక్‌ తెచ్చుకుని కలెక్షన్లతో దూసుకుపోయిన ఊసరవెల్లి. ఇటీవల రిలీజై బ్లాక్ బస్టర్ తెచ్చుకున్న దేవర డే 1, డే2 రికార్డులను 13 ఏళ్ల క్రితం ఊసరవెల్లి క్రియేట్ చేసింది. అలాంటి దేవ‌ర‌ తాజాగా సీడెడ్‌ లోని ఓ ఏరియాలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Devara: Part - 1 Movie Review: Jr NTR shines in a visually stunning yet  predictable action drama

సీడెడ్‌.. అనంతపూర్లో సలార్, కాల్కి రెండు మూవీస్ అదిరిపోయే రేంజ్‌లో కలెక్షన్లు కలగొట్టిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన దేవర ఈ కలెక్షన్ రికార్డులను తుక్కుతుక్కు చేసేసింది. అనంతపూర్‌లో దేవర రూ.2.5కోట్ల‌ కంటే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక సినిమా రిలీజై రెండు వారాలు దాటుతున్న.. దేవరకు చాలా చోట్ల ఇప్పటికి ఫుల్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అలా ఈరోజు కూడా పలుచోట్ల బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. దేవ‌ర‌ వీకెండ్ కలెక్షన్ మంచి లాభాలను సొంత చేసుకోవడం పక్కా అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Buzz: Kalki 2898 AD Made Bigger Deal Than Salaar

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. దేవ‌ర‌ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే సినిమా పై మొదట ఫ్లాప్ టాక్ వచ్చినా.. తర్వాత ప్రేక్షకులు సినిమాకు తరలి రావడంతో.. రివ్యూలను నమ్మాల్సిన అవసరం లేదంటూ ఓ టాక్‌ వైరల్ గా మారింది. ఇక దేవ‌ర‌ ఫస్ట్ పార్ట్ సక్సెస్ సాధించడంతో.. దేవర 2కి మరింత ప్లస్ కానుంది. గ‌త సినిమాతో విమర్శలు ఎదుర్కొన్న కొరటాలకు ఇది చాలా గొప్ప రిజల్ట్. మళ్లీ త్రో బ్యాక్ చేసింది. ఇక కొరటాల కెరీర్‌కు ఫ్యూచర్ లోను.. ఎలాంటి ఢోకా ఉండదనడంలో అతిశయోక్తి లేదు. ఇక దేవ‌ర‌ సినిమాలు నిర్మించిన ప్రొడ్యూసర్లకు.. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా లాభాలు వచ్చాయని సమాచారం. ఇక దేవర ఫుల్ రన్ కలెక్షన్ గురించి సోమవారం అఫీషియల్ పోస్టర్ మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారట.