స్టార్ హీరో రజినీకాంత్‌కి సౌత్‌లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లోను ఇతర దేశాల్లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలను హిట్, ప్లాప్‌లతో సంబంధం లేకుండా ఆడియన్స్ వీక్షిస్తూ ఉంటారు. ఇలాంటి క్రమంలో తాజాగా రజనీకాంత్ నుంచి వచ్చిన మూవీ వెట్టయాన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై.. జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞానవేలు తెరకెక్కించిన ఈ సినిమాలో మంజు వారియర్స్, అమితా బచ్చన్, రితికా సింగ్, రానా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రజనీకాంత్ వెట్టయాన్‌తో ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో.. అభిమానుల రియాక్షన్ ఏంటో ట్విట్టర్ రివ్యూల ద్వారా తెలుసుకుందాం.
NEW INDUSTRY HIT 🎯 #VettaiyanReview | #Rajinikanth | #SuperstarRajinikanth
— பூரியார் ¶¶¶|||•• செவிட்டு தவளை ••|||¶¶¶ (@Imtweetygoose) October 9, 2024
సూపర్ స్టార్ సినిమా అంటే ఆయన హీరోయిన్స్ మేనరిజమే ఎక్కువగా హైలైట్ అవుతూ ఉంటుంది. కానీ.. ఈ సినిమాతో ఆయన నటన హైలెట్గా నిలిచింది. ఎర్లీ షో చూసిన ప్రేక్షకులు అయిన నటన గురించి పలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇది యాక్టింగ్ బేస్ సినిమా అని వివరిస్తున్నారు. సినిమా థీం కూడా బాగుందని.. రజిని ఫ్యాన్స్ కొందరు ఇండస్ట్రీ హిట్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిమానులను సినిమా ఏమాత్రం డిసప్పాయింట్ చేయదని.. ఫ్యాన్స్ కోరుకునే విధంగానే మాస్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయని.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా రజినీకాంత్ తన నటనతో మెస్మరైజ్ చేశాడంటూ చెబుతున్నారు.
#VettaiyanReview: First reports are Super theme, Acting based Movie
– #Rajinikanth #AmithabBachan dominated the film
– #FahadhFaasil #Rana are Good
– Talk is Interval, 2nd half Highlight of the Movie
– Good twist with message #Vettaiyan #Anirudh #Coolie #Ritikasingh pic.twitter.com/C8bx2WY1Ua— MJ Cartels (@Mjcartels) October 8, 2024
ఆయనతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కూడా మిగతా నటినటులను డామినేట్ చేసే విధంగా నటించారని వెల్లడించారు. డైరెక్టర్ టీజే జ్ఞానవెల్.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి స్టార్టింగ్ నుంచి కొద్దిగా సమయం తీసుకున్నారని.. ఇంటర్వెల్ వచ్చేసరికి సినిమా ఓకే అనిపించుకుందని పలువురు ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అక్కడి నుంచి క్లైమాక్స్ వరకు సినిమా హైలెట్గా నిలిచిందట. సెకండ్ హాఫ్ సినిమాకు ప్లస్ అయిందని.. సినిమాలో ట్విస్ట్ లతో కూడిన మంచి సందేశాన్ని చూపించారని చెటుతున్నారు. అ ట్విస్ట్ ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Thaaaaaaaa!
Terrific screenplay writing! Unbelievable TWIST!
Absolute banger of a first half!
TJ Gnanavel – you won biggggg!
Just 50% more to show the world you are bigger than NELSON or KARTHIK SUBBARAJ!
One of the best first half ever! #Vettaiyan IS GOING TO BE HUGE!— Don Ak (@Indiamyheart123) October 10, 2024
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ రానా దగ్గుబాటి విలన్ రోల్ లో కనిపించిన సంగతి తెలిసిందే. తమిళనాడులో జరిగిన ఫ్రీ రిలీజ్ వేడుకల్లో రానా పై రజినీకాంత్ ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించాడు. రామానాయుడు మనవడుగా చిన్నప్పటి నుంచి తెలుసు కానీ తన కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి.. ఇప్పుడు సినిమాలో కొన్ని సన్నివేశాల్లో రానా సీరియస్‌గా ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకే భయమేసింది అంటూ వెల్లడించారు. ఆయన అన్నట్లుగానే సినిమాలో రానా పాత్రతో పాటు నటన కూడా చాలా అద్భుతంగా ఉందట. పుష్పా సినిమాలో షేకావత్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన పాహద్ ఫాజిల్ నటన ఆకట్టుకుంటుందని.. ట్విటర్ వేదికగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.