టాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీ అజయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో పవర్ఫుల్ విలన్ గా కొనసాగుతున్న అజయ్.. పలు సినిమాల్లో క్యారెట్ల ఆర్టిస్ట్ గాను నటించాడు. ఇప్పటికే వందలాది సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్టర్.. ముఖ్యంగా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాల్లో నటించిన టిట్ల పాత్రతో మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. తర్వాత ఆర్య 2, దూకుడు, రాజన్న, ఇష్క్, గబ్బర్ సింగ్, అలవైకుంఠపురం ఇలా ఎన్నో హిట్ సినిమాలలో నటించి తనదైన ముద్ర వేసుకున్నాడు.
అంతేకాదు.. సారాయి వీరాజు సినిమాతో హీరోగాను తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర పార్ట్ 1లోను పోలీస్ ఆఫీసర్ శివం పాత్రలో కనిపించాడు. ఇక విలన్‌గా మంచి పాపులారిటి దక్కించుకున్న అజయ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలిసి ఉండదు. ఆయన భార్య శ్వేతా రావూరి. గతంలో మోడల్గా వ్యవహరించిన ఈ అమ్మడు 2017 మిస్ ఇండియన్ పోటీల్లోనూ సందడి చేసి చివరి వరకు వెళ్ళింది. అజయ్, శ్వేతలు 2005లో వివాహం చేసుకున్నారు.
వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే అజయ్ ఎక్కువగా ఫ్యామిలీతో బయట కనిపించరు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. టూర్లు, వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తూ తన భార్యతో కలిసి దిగిన ఫ్యామిలీ ఫొటోస్‌ను షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా వీరికి సంబంధించిన ఫ్యామిలీ పిక్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. అభిమానులు అజయ్ భార్యను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి టాలీవుడ్ విలన్‌కి ఇంత అందమైన భార్య ఉందా అంటూ.. నిజంగా శ్వేత ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు అంటూ.. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram