టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న విశ్వంభరపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఫాంటసీ డ్రామాగా మల్లిడి వసిస్ట డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ను చిరూ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేస్తారని మొదట్లో వార్తలు వినిపించాయి. కానీ.. విఎఫ్ఎక్స్ సంతృప్తిగా లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న టీం.. పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు దసరా కానుకగా అయినా.. టీజర్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. టీజర్ కూడా సిద్ధంగా ఉంది. మూవీ టీమ్ ఒకటికి రెండుసార్లు అంత చెక్ చేసుకుని ఓకే అనుకున్నారట.
అయితే ఇప్పటివరకు చిరంజీవి నుంచి దానికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. విశ్వంభర రిలీజ్‌కు జనవరి 10 వరకు సమయం ఉంది. కానీ గేమ్ ఛేంజర్ డిసెంబర్‌కు వాయిదా పడి సంక్రాంతి బరిలో వస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే విశ్వంభర సంక్రాంతి రేస్ నుంచి వేసవి సెలవులకు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో వేసవిలో విడుదల అయ్యే సినిమాకు ఇప్పుడే టీజర్ రిలీజ్ చేసి ఉపయోగం ఉండదని చిరు భావిస్తే.. విశ్వంభర టీజర్ రాకపోవచ్చు.
ఒకవేళ వచ్చిన అందులో రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఉండకపోవచ్చు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇటీవల చిరంజీవి కూడా స్వల్ప అనారోగ్యానికి గురయ్యారట. ఈ క్రమంలో సినిమా షూట్ కూడా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. దసరాకు ఆయనను మళ్ళి సెట్స్‌కు తెచ్చుకువచ్చే అవకాశం ఉందని టాక్. ఆయన మూడు రోజుల కాల్‌షీట్లు ఇస్తే సినిమా పూర్తి అయిపోతుందని ఇన్సైడ్ వర్గాల సమాచారం. దీంతో పాటే రెండు పాటలను పూర్తి చేయాల్సి ఉంది. అందులో ఓ ఐటెం సాంగ్ ఉంది. అయితే ఈ రెండు సాంగ్లను నవంబర్ లోపు పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయాలని మేకర్స్ భావిస్తున్నారట. సంక్రాంతికి వచ్చినా.. రాకపోయినా.. పని మాత్రం నవంబర్లో ముగించేయాలని టీం ఫిక్స్ అయ్యారు.