టాలీవుడ్ మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఎవరు.. ఎవరి వల్ల పనులు జరుగుతాయి.. అంటే చాలామంది గతంలో దిల్ రాజు లేదంటే మరో పెద్ద స్టార్ డైరెక్టర్ పేరు చెబుతూ ఉండేవారు. కానీ.. ఇప్పుడు వారెవరి పేరు కాదు.. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు మొదట వినిపిస్తుంది. అందరికన్నా టాలీవుడ్ లో ఫవర్ ఫుల్ పర్సన్ త్రివిక్రమ్ అంటూ కామెంట్‌లు వ్యక్తమవుతున్నాయి. కారణం ఇప్పుడు ఏపీ గవర్నమెంట్‌లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా వ్యవహరించడమే. పైగా సినిమాలకు సంబంధించిన విషయాలు మొత్తం చూసుకునే బాధ్యతను పవన్ కళ్యాణ్‌కు అప్పచెప్పారు చంద్రబాబు. ఇక పవన్ తనకెంతో సన్నిహితుడైన త్రివిక్రమ్‌కు.. ఈ సినిమా విషయాలు, ఇండస్ట్రీ సంబంధిత విషయాలు చూసుకునే బాధ్యతలు అప్ప చెప్పారట.
అంటే ఇండస్ట్రీలో ఎవరికి ఏం కావాలన్నా మొదట త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అది పవన్ కళ్యాణ్ వద్దకు వెళుతుంది. అన్ని త్రివిక్రమ్ దగ్గర ఉండి చూసుకుంటున్నడు. మొన్న కల్కి సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో కూడా నిర్మాత అశ్వినీ దత్ ముందు త్రివిక్రమనే కలిశారట. త్రివిక్రమ్ సహాయంతోనే పవన్ దగ్గరకు వెళ్లి టికెట్లు రేట్లు పెంచుకున్నారు. అలాగే తర్వాత వచ్చిన దేవర సినిమా విషయంలోనూ త్రివిక్రమ్ అప్రోచ్ అయ్యి పర్మిషన్లు తెచ్చుకున్నారు. అలా ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో కూడా త్రివిక్రమ్ను కలవనున్నారట మేకర్స్. బన్నీ, పవన్ మధ్య ఇప్పటికే సంబంధాలు సరిగ్గా లేవని ప్రచారం ఉంది.
కాగా పుష్ప 2 నిర్మాతలకు.. త్రివిక్రమ్‌కు మధ్య మంచి బాండ్ ఉంది. అలాగే బన్నీ నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్‌తో తెరకెక్కనుంది. ఈ క్రమంలో త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్, బన్నీ మధ్యలో ఉన్న వివాదాలను పరిష్కరిస్తాడా.. ఈ సమస్యలకు చెక్ పెడతాడా.. లేదా.. అనేది అందరిలో ఆసక్తి నెలకొల్పుతుంది. ఇలా ఇండస్ట్రీ విషయాలు పరిష్కరించడంలో త్రివిక్రమ్ చాలా పవర్ఫుల్ గా మారిపోయాడంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. త్రివిక్రమ్‌ఖు అధికారికంగా ఎలాంటి పవర్స్ లేకున్నా.. పవన్ తనపై ఉంచిన నమ్మకంతోనే త్రివిక్రమ్ పై అందరి చూపు ఉందని.. త్రివిక్రమ్ కి అంత పవర్ వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది.