ఇటీవల తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు నెటింట దుమారం రేపాయి. బిఆర్ఎస్ కార్యనిర్వాహన అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే ప్రాసెస్‌లో ఇండస్ట్రీలోని సెలబ్రెటీలను రాజకీయాల్లోకి తీసుకువస్తూ ఆమె కామెంట్స్ చేశారు. సమంత, నాగచైతన్య.. కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారు అంటూ మీడియాతో ఆమె చేసిన కామెంట్స్ నెటింట తెగ వైరల్‌గా మారాయి. ఈ మాటలపై అక్కినేని కుటుంబంతో పాటు సమంత కూడా ఫైర్ అయ్యింది. అలాగే పలువురు సినీ సెలబ్రిటీస్ కూడా ఈ వ్యాఖ్యలు ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వ్యక్తిగత జీవితాలను.. రాజకీయాలోకి తీసుకువెళ్లి బహిర్గతంగా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదంటే ఎన్టీఆర్, నాని ఫైర్ అయ్యారు.
ఒకరి వ్యక్తిగత జీవితాన్ని బయటపెడుతూ దిగజారుడు రాజకీయాలు చేయడం రాజకీయాలకు పరాకాష్ట అంటూ ఎన్టీఆర్ కామెంట్స్ చేశాడు. పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు సమాజంలో హుందాతనం, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించే విధంగా ఉండాలి. కానీ.. ఇలా సినీ పరిశ్రమపై నిరాధార కామెంట్లు చేయడం సరికాదు. నిజంగా ఇది చాలా బాధాకరమైన ఘటన అంటూ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారు. ఇతరులు సినీ ఇండస్ట్రీపై ఎలాంటి నిరాధారణ ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేది లేదంటూ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు. ఒకరినొకరు గౌరవించుకోవాలి లిమిట్స్ దాటి ప్రయత్నించకుండా ఉండేందుకు ఈ అంశంపై మేము పోరాడతామంటూ ఇలాంటి ప్రవర్తన అసలు సరికాదు అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ కామెంట్ చేశారు.
అలాగే టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. బాధ్యత గల పదవిలో ఉన్న ఒక రాజకీయ నాయకురాలు అర్థం లేని మాటలు అనడం అసహ్యం కల్పిస్తుంది. కాస్తయినా బాధ్యత లేకుండా మాట్లాడే ఈ మాటలు చూస్తుంటే ప్రజలపై మీకు బాధ్యత ఉందా.. లేదా.. అనే సందేహం కలుగుతుంది. సెలబ్రిటీస్, సినీ ఇండస్ట్రీ, రాజకీయం అని కాదు.. గౌరవప్రదమైన స్థానంలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం సరైన విధానం కాదు. చెడు మాటలతో సమాజం పై ప్రభావం ఉంటుందని ఇలాంటి చర్యలను ఖండించాలని హీరో నాని సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ సురేఖ పై ఫైర్ అయ్యాడు.
Konda Surekha garu, dragging personal lives into politics is a new low. Public figures, especially those in responsible positions like you, must maintain dignity and respect for privacy. It’s disheartening to see baseless statements thrown around carelessly, especially about the…
— Jr NTR (@tarak9999) October 2, 2024
Disgusting to see politicians thinking that they can get away talking any kind of nonsense. When your words can be so irresponsible it’s stupid of us to expect that you will have any responsibility for your people. It’s not just about actors or cinema. This is not abt any…
— Nani (@NameisNani) October 2, 2024