టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో జాన్వికపూర్ హీరోయిన్గా.. సైఫ్ అలీ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకు మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మూడు రోజులకు ఏకంగా 340 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి సినిమా రికార్డు క్రియేట్ చేసింది. మిక్స్‌డ్ టాక్‌తో ఈ రేంజ్ లో కలెక్షన్లు రావడం అంటే అది సాధారణ విషయం కాదు. ఈ క్రమంలోనే ఇప్పటికీ దేవర జోరు బాక్సాఫీస్ దగ్గర కొనసాగుతూనే ఉంది.
దాదాపు ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వచ్చి ఆరేళ్లు కావడం, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా తర్వాత తారక్ మరోసారి స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే సోలో.. బిగ్గెస్ట్ గ్రాసెర్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. వీకెండ్, వీక్ డేస్ అని సంబంధం లేకుండా అన్ని రోజులు స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. దేవర నైజం లో ఇప్పటికే సాలిడ్ నెంబర్ ను నమోదు చేసింది. కేవలం నైజాం ఏరియా లోనే దేవర ఐదో రోజుకు ఏకంగా రూ.2.37 కోట్ల షేర్ ని కొల్లగొట్టింది.
ఓవరాల్గా ఐదు రోజుల్లో రూ.37.75 కోట్ల షేర్వాసూళ్లను సాధించి రికార్డు క్రియేట్ చేసింది. జీఎస్టీ కాకుండానే ఈ రేంజ్ లో వసూళను సాధించడం అంటే అది సాధారణ విషయం కాదు. ప్రస్తుతం రూ.40 కోట్ల దిశగా దూసుకుపోతున్న దేవర నైజంలో ఎన్టీఆర్ ముద్దుల బావ స్టార్ హీరో అల్లు అర్జున్ అలవైకుంఠపురం లాంగ్ రన్ కలెక్షన్లను తుక్కుతుక్కు చేసేసింది. బన్నీ అలవైకుంఠపురం లాంగ్ రన్‌లో రూ.42 కోట్ల కలెక్షన్లు కొల్లగొడితే.. ఇప్పుడు దేవర మరో రెండు మూడు రోజుల్లో రూ.42 కోట్ల గ్రాస్‌వసుళను కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేయనుంది. అలా తారక్.. బావ బన్నీ రికార్డుని బ్లాస్ట్ చేసిపడేయనున్నాడు.