రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరు ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్‌లుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభంలో మెగా హీరోలుగా అడుగుపెట్టిన వీరిద్దరి మధ్యన బాండింగ్ కూడా అంతే గట్టిగా ఉండేది. ఎప్పటికప్పుడు వీరిద్దరు స్నేహంగా ఉంటూ.. ఒకరు సినిమాప్రమోషన్స్‌లో ఒకరు పాల్గొంటూ సందడి చేస్తూ ఉండేవారు. ఒకరి గురించి మరొకరు ప్రసంసలు కురిపించుకుంటూ ఉండేవారు. అయితే ఇటీవల కాలంలో వీరి మధ్యన కొద్దిపాటి గ్యాప్ వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నా.. వీరిద్దరూ మాత్రం బహిరంగంగా ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు. సినిమా వస్తే చూడాలని మెగా అభిమానులు అంత కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గతంలోనే వీరి కాంబోలో ఎవడు సినిమా వచ్చినప్పటికీ సినిమాలో బన్నీ పాత్ర నడివి చాలా తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే మరోసారి వీరికి కాంబోలో మూవీ వస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండే ఇద్దరు హీరోలు ఒకరిపై ఒకరు ఎన్నో సీక్రెట్స్ బయటకు రివీల్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ కి సంబంధించిన ఓ సీక్రెట్ ను బన్నీ ఇంటర్వ్యూలో వివరించాడు. ఎవడు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో బన్నీ పాల్గొన్నారు. బన్నీతో పాటే రామ్ చరణ్ కూడా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. అయితే ఇంటర్వ్యూలో హోస్ట్‌గా శ్యామల వ్యవహరించింది. ఇందులో చరణ్ ను యాంకర్ ప్రశ్నిస్తూ.. మీ ప్రతి సినిమాలో హీరోయిన్గా కాజల్ ని ఎందుకు తీసుకుంటున్నారు.. ఎవరు సినిమాలో మీ పక్కన కాజల్ నటించకపోయినా ఈ సినిమాలోని ఓ హీరోయిన్గా కాజల్‌ను తీసుకోవడానికి కారణమేంటి ఎందుకిలా అని శ్యామల ప్రశ్నించింది. దానికి బన్నీ రియాక్ట్ అవుతూ.. చెర్రీ సినిమాలో కాజల్ తీసుకోవడానికి కారణం ఆమె త్వరగా కలిసిపోతుంది. వారి మధ్యలో కెమిస్ట్రీ బాగుండడంతో ఇద్దరి కాంబోలో సినిమాలు వచ్చేస్తున్నాయి.
ఇక కొత్త హీరోయిన్ తో చేయాలంటే మళ్ళీ మాటలు కలవాలి.. వారి అభిప్రాయాలు కలవాలి. అదే పాత హీరోయిన్ అయితే అన్నింటిలో త్వరగా సెట్ అయిపోతుంది అంటూ బన్నీ వివరించాడు. అయినా మీ అమ్మాయిలు ఎందుకు ప్రతి సినిమాలోను హీరోయిన్ల గురించి ప్రశ్నిస్తారు.. అని బన్నీ అడగగా శ్యామల రియాక్ట్ అవుతూ మా అభిమాన హీరో ఎవరికో ముద్దులు పెడుతుంటే, హగ్గులు ఇస్తుంటే ఆ హీరోయిన్ ఎందుకు అంత స్పెషల్.. ఆమెకు ఎందుకంత ఇంపార్టెన్స్ అని తెలుసుకోవాలని ఆసక్తి మాలోను ఉంటుంది కదా అంటూ శ్యామల వివరించింది. దానికి బన్నీ రియాక్ట్ అవుతూ.. రొమాన్స్ లేదు.. ఏమి లేదు.. మాకు అసలే పెళ్లిళ్లు అయిపోయాయి. ఇలాంటివి పెట్టకండి అంటూ ఫన్నీగా కామెంట్ చేశారు. అయితే ఎంతో స్పెషల్ గా అల్లు అర్జున్.. చెర్రీ, కాజల్ మధ్యన బాండింగ్ గురించి మాట్లాడడంతో ఈ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారింది.