ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తుతం ఇండియన్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ పేరు వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గెలుపుకు జనసేన ఎలాంటి కీలకపాత్ర పోషించిందో అందరికీ తెలిసిందే. ఇక సినిమా, రాజకీయ విషయాల్లో పవన్ కళ్యాణ్ లెజెండ్ గా దూసుకుపోతున్నాడు. కాగా పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ కూడా తెరిచిన పుస్తకమే. ఆయన ఇప్పటివరకు తన పర్సనల్ లైఫ్ లో మూడు వివాహాలు చేసుకున్న సంగతి అందరికి తెలుసు.
పవన్ కళ్యాణ్ చివరిగా రష్యాకు చెందిన అన్నా లేజినోవాను వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అన్నాకు సంబంధించిన ఆస్తుల విలువ నెటింట హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఆస్తుల లెక్కలు తెలిసి నెటిజన్స్ ఫ్యూసులు ఎగిరిపోతున్నాయి. ఇంతకీ ఆ ఆస్తుల విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మెగా ఆస్తులతో పోల్చుకుంటే ఈమె ఆస్తులు చాలా ఎక్కువ అని.. పవన్ కళ్యాణ్ ఆస్తుల కంటే ఐదు రెట్లు ఎక్కువగా అన్న లేజినోవా ఆస్తులను కూడా పెట్టుకుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
రష్యాలో ఒక మోడల్‌గా వంయవహరించిన అన్నా లేజినోవా.. అక్కడ ఎన్నో బిజినెస్లను స్థాపించి కోట్లల్లో గడించింది. దాదాపు ఈమెకు రష్యాలో 125 రెస్టారెంట్లు, 41 హాస్పిటల్, 86 సినిమా ధియేటర్లు ఉన్నాయని అంతర్గత వర్గాల సమాచారం. ఆమె ఆస్తి ప్రతి ఏడాదికి పెరుగుతూనే ఉంటుందట. అలా ప్రస్తుతం అన్న ఆస్తుల విలువ దాదాపు రూ.1600 కోట్ల పైచిలుకేనట. కాగా ఈ ఆస్తులు అన్ని లెజినోవా తన కొడుకు, కూతురు పేరు మీద రాసేసిందని వార్త నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. అయితే మెగా ఆస్తులతో పోలిస్తే.. ఈన్నా ఆస్తులు చాలా ఎక్కువ అని తెలియడంతో అంతా నూరేళ్ళబెడుతున్నారు.