సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ ఆరోపణలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. ఇక ఇటీవల కోలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్ ప్రకంపనల తర్వాత ఎన్నో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ అయిన జానీ మాస్టర్ పై కూడా రేప్ కేసు నమోదు అయింది. ఆ తర్వాత చాలామంది బయటకు వచ్చి తమ కూడా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నామంటూ వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హీరోయిన్ తన గతంలో ఎదుర్కొన్న లైంగికఆరోపణల గురించి వెల్లడించింది. ఆమే మలయాళ నటి మిన్ను మున్నీర్. మిన్ను మాట్లాడుతూ తన గతంలో సినిమాలు నటిస్తున్న క్రమంలో ఓ మూవీని స్టార్ డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడని వెల్లడించింది. అతను వాళ్లందరితో కూర్చుని గ్రూప్ సెక్స్ వీడియోలు చూడాలని బలవంతం చేశాడు. దాంతో నాకు అతని ప్రవర్తన ఇబ్బందిగా అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది. తర్వాత అతను నన్ను తన గదిలోకి కూడా పిలిచాడని.. నేను వెళ్లేసరికి అప్పటికే అక్కడ అతనితో పాటు మరో ముగ్గురు యువతులు కూడా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది.
వారంతా కలిసి ఆ వీడియోలను చేస్తున్నారని.. వాళ్ళు నన్ను కూడా అలా చేయాలంటూ ఫోర్స్ చేశారని వెల్లడించింది. దాంతో అక్కడి నుంచి నేను వెంటనే బయటకు వచ్చేసా.. ఎప్పటికీ నేను ఆ విషయాన్ని మర్చిపోను కూడా.. అందుకే నేను మలయాళ ఇండస్ట్రీని వదిలేసి.. చెన్నైకి వెళ్ళిపోయా అంటూ మిను మున్నీర్ వివరించింది. ప్రస్తుతం ఆమె వీడియో నెటింట వైరల్‌గా మారడంతో.. వామ్మో ఇప్పటివరకు ఈ మలయాళ ఇండస్ట్రీలో ఎన్ని ఘోరాలు జరిగాయి అంటూ అంత ఆశ్చర్యపోతున్నారు.