ఈ పై ఫోటోలో ఉన్న అమ్మడిని గుర్తుపట్టారా.. ఒకప్పుడు టాలీవుడ్ లో వరుస సినిమాలో నటిస్తూ దూసుకుపోయిన ఈ స్టార్ హీరోయిన్.. టాలీవుడ్ లోనే కాదు సౌత్ లోనూ, బాలీవుడ్ లోను దాదాపు అగ్ర హీరోల అందరి సరసన నటించి కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నుంచి అక్షయ్ కుమార్ వరకు తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి నుంచి వెంకటేష్ వరకు దాదాపు అందరి సరసన నటించింది. వరుసగా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్న సమయంలోనే.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది. ఎంతోమంది స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. చివరకు యాక్టింగ్‌కు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. కాంగ్రెస్ పార్టీలో క్రియశిల నాయకురాలిగా కొనసాగింది.
బాలీవుడ్, సౌత్ ఫిలిం ఇండస్ట్రియల్ తో పాటు భోజపురి లోనూ నటించింది. అలీ 80కి పైగా సినిమాల్లో నటించి మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో చెప్పలేదు కదా తనే హీరోయిన్ నగ్మా. తన అందం, అభినయంతో ప్రతి ఇండస్ట్రీలోనూ తన సత్తా చాటుకున్న నగ్మా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడు సినీ కెరీర్ కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలో ఎప్పుడు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలా తన కెరీర్ లో ఇప్పటికే అమ్మడు ముగ్గురు పెళ్లి అయిన హీరోలతో ఎఫైర్ పెట్టుకుందని టాక్. వారితో పాటే టాప్ క్రికెటర్ అయినా క్యాపిటన్ సౌరవ్ గంగూలీతోను ఈమె డేటింగ్ చేసిందంటూ వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి.
అయితే తన నటన ప్రపంచంలో ఎంతోమంది హీరోలతో రొమాన్స్ చేసిన.. పర్సనల్ లైఫ్ లో మాత్రం 50ఏళ్ళు మీద పడుతున్న సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక సినిమాలకు సడన్గా గుడ్ బై చెప్పేసి.. నగ్మా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఇక రాజుల కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో నగ్మ చిన్నప్పటి నుంచే విలాసవంతమైన లైఫ్ లీడ్ చేసింది. సినీ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. పర్సనల్ లైఫ్ లో మాత్రం నలుగురితో ఎఫైర్ నడిపిందంటూ వార్తలు వచ్చిన.. ఒక్కరితోను ఆమె ప్రయాణం కొనసాగలేదు. ప్రస్తుతం 49 ఏళ్ళ వయసు ఉన్న ఇప్పటికీ ఆమె ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.