టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడు.. ఎవరి.. లక్ ఎలా.. మారుతుందో ఎవ్వరు చెప్పలేరు. ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీలుగా వెలుగు వెలిగిన వాళ్ళు కూడా కొంతకాలానికి ఫేడ్ అవుటై.. తర్వాత దీనమైన పరిస్థితులను ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఒక చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ సెలబ్రిటీలుగా మారి కోట్లల్లో ఆస్తులు సంపాదించిన సెలబ్రిటీస్ కూడా ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా లక్ కలిసి రాకపోయినా.. సినిమాల ద్వారా ఏర్పడిన పరిచయంతో స్టార్ హీరో ను పెళ్లి చేసుకుని ప్రసతుతం దాదాపు రూ.400 కోట్లకు అదిపతిగా మారింది.
ఇంతకీ ఆమె ఎవరో.. అసలు డీటెయిల్స్ ఏంటో.. ఒకసారి తెలుసుకుందాం. తను మరెవరోకాదు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. 1993లో మిస్ ఇండియా పోటీల్లో అడుగుపెట్టి టైటిల్ గెలుచుకుంది. తర్వాత మిస్ యూనివర్స్ పోటీల్లోనూ భారత్‌కు ప్రాతినిధ్యత వహించి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. అమ్ముడు సినిమాల విషయానికి వస్తే.. 1977లోనే శత్రుఘ్న సిన్హా డైరెక్షన్ లో వచ్చిన షిరిడీ కే సాయిబాబా మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదటిసారి సినిమాలో నటించింది. తర్వాత 1998లో రిలీజ్ అయిన జబ్ ప్యార్ కిసీసే హోతా హై.. సినిమాతో హీరోయిన్గా మారింది. మొదటి సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. తర్వత సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నా ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
అలా నమ్రత తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించగా.. దాదాపు 16 సినిమాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఇక తన బాలీవుడ్ సినీ కెరీర్లో 6 సంవత్సరాలలో 16 ప్లాప్లను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఇక్కడ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే వంశీ సినిమాల్లో నటిస్తున్న టైం లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు పరిచయం కావడంతో అమ్మడి దశ మారిపోయింది. వీరిద్దరూ ప్రేమలో పడటం.. ఐదు సంవత్సరాల ప్రేమాయణం తర్వాత 2005లో గ్రాండ్ లెవెల్లో వివాహం జరుపుకున్నారు. ఇక వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్, సీతార ఉన్న సంగతి తెలిసిందే. గౌతమ్ 1 నేనొక్కడినే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే ప్రేక్షకులను మెప్పించాడు. ఇక కూతురు సితార కూడా ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కు అంబాసిడర్గా వ్యవహరించి పాపులారిటీ దక్కించుకుంది. కాగా ప్రస్తుతం నమ్రత ఆస్తి దాదాపు రూ.400 కు కోట్లకు పైగా ఉంటుందని టాక్.