యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాజా మూవీ దేవర టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాలో తారక్ నటించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్‌గా మారుతున్నాయి. అయితే ఇంకా షూటింగ్ మొదలుకాకుండానే ప్రశాంత్, తారక్ కాంబోలో రాబోతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ పై ఎన్నో ఊహగా నలువైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ ని ఫిక్స్ చేయనున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పేరు తమిళ్ హీరో ప్రదీప్ రంగనాథన్ సినిమా కోసం ఆల్రెడీ రిజిస్టర్ చేసి పెట్టారు. ఈ క్రమంలోని టైటిల్ ఎవరికి సొంతమవుతుందో అనే ఆసక్తి ప్రేక్షకుల నెలకొంది.
ఇక దీంతో పట్టే సినిమాకు సప్త సాగరాలు ఫేమ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారని టాక్. సాధారణంగా ప్రశాంత్ నీల్ సినిమాలో హీరోయిన్లకు కూడా ప్రాధాన్యత సమానంగా ఉంటుంది. ఇప్పటికే వచ్చిన కేజిఎఫ్, సలార్‌లో శ్రీనిధి శెట్టి, శృతిహాసన్ విషయంలో మనం దీనిని అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు వాటికన్నా మెరుగైన క్యారెక్టర్‌లో రుక్మిణిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే సినిమా బ్యాక్ డ్రాప్ కు సంబంధించిన న్యూస్ కూడా వైరల్ గా మారుతుంది. సినిమాను బంగ్లాదేశ్ లో ఇరుక్కున్న ప్రవాస భారతీయుల నేపథ్యంలో.. వాళ్లను కాపాడే పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించేలా డిజైన్ చేశారని.. తారక్‌ను చాలా గొప్పగా సినిమాలో చూపించబోతున్నారని టాక్ నడుస్తుంది. ఇక ప్రశాంత్ నీల్ సినిమా అంటే బ్లాక్ అండ్ వైట్ మూడ్లో ఉన్నట్లుగా తెరకెక్కిస్తారు.
కానీ.. ఈసారి అది కూడా కాస్త మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ నడుస్తుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన ప్రశాంత్ ప్రస్తుతం లొకేషన్‌లతోపాటు.. ఇంటీరియల్ గా వేయవలసిన సెట్స్ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాడని సమాచారం. వార్ 2 లో తన భాగం పూర్తిచేసుకుని ఎన్టీఆర్ తిరిగి వచ్చిన వెంటనే.. నీల్ సెట్లోకి అడుగుపెడతాడట. ఇక ఇప్పటికే సినిమాను 2026 సంక్రాంతి బరిలో మూవీ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడు ప్రశాంత్ నీల్ సినిమాలకు జాప్యం లేకుండా పక్కా ప్లాన్ తో డిజైన్ చేస్తారని తెలిసిందే. మొత్తంగా చూస్తే ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి రాకముందే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేస్తుంది. అయితే బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో సినిమా తెరకెక్కుతుందని తెలియడంతో అభిమానులంతా తారక బిగ్ రిస్క్ చేస్తున్నాడే.. అయినా సినిమా సక్సెస్ కాయమంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.