ఎన్టీఆర్ 31 లో తారక్ కు జంటగా ఆ టాలెంటెడ్ హీరోయిన్.. అసలు ఊహించలేరు..?

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన దేవర యావ‌రేజ్ టాక్‌తోను సక్సెస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తారక్ నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల విపరీతమైన ఆసక్తి నెలకొంది. త్వరలోనే ప్రశాంత్ నీలి కాంబోలో ఎన్టీఆర్ 31 షూట్ ప్రారంభం కానుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. సినిమాలో హీరోయిన్గా కన్నడ బ్యూటీ ని సెలెక్ట్ చేసినట్లు స్టోరీ కూడా ఇదే అంటూ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ప్ర‌శాంత్ నీల్‌, తారక్ కాంబోలో ఎప్పుడో మూవీ ని ప్రకటించిన సంగ‌తి తెలిసిందే.

NTR and Prasanth Neel Project Shoot Plan?

కానీ ఇద్దరు ఎవరు సినిమాలతో వాళ్ళు బిజీగా ఉండడంతో సినిమా ఇన్నాళ్లు సెట్స్ పైకి రాలేదు. ఇక ప్రస్తుతం ఇద్దరు ఫ్రీ అయ్యారు. ఈ క్రమంలోనే సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం కానుందని డిసెంబర్ నుంచి తారక్ సెట్స్ కి వెళ్లనున్నట్లు సమాచారం. ఇక సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్.. రుక్మిణి వసంత్‌ను ఈ సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ చేసిన‌ట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక 2019లో ఈ అమ్మ‌డు హీరోయిన్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినా.. సెలెక్టివ్గా సినిమాలను ఎంచుకుంటూ నటిస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తమిళ్‌లో ఒక సినిమా కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతుంది రుక్మిణి.

Rukmini Vasanth: రామ్ పోతినేని జోడిగా 'సప్త సాగరాలు దాటి' హీరోయిన్.. క్రేజీ  ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్.. - Telugu News | Sapta Sagaralu Daate movie  fame Rukmini Vasanth ...

ఇక తాజాగా తారక్ సరసన నటించే ఛాన్స్ రుక్మిణి కొట్టేసింది అంటూ వార్తలు వైరల్ అవుతున్న క్ర‌మంలో ఈ న్యూస్ తెలిసిన రుక్మిణి అభిమానులంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ ఫేవరెట్ హీరోయిన్ తార‌క్ స‌ర‌స‌న కనిపిస్తుందంటూ.. ఎగ్జైట్‌ అవుతున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ కూడా బంగ్లాదేశ్ బంయాక్‌ డ్రాప్‌తో తెరకెక్కనుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో సినిమా రూపొందించనున్నాడట నీల్. కాగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు.