పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నిన్న మొన్నటి వరకు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసిన పవన్ ప్రస్తుతం రాజకీయాల్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. పవన్ కాదు తుఫాన్ అంటూ.. ప్రధాని మోదీ స్వయంగా ఆయనపై ప్రశంసలు వర్షం కురిపించాడు అంటే.. ఏపీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇటీవల జరిగిన ఎలక్షన్స్ లో చరిత్ర సృష్టించిన పవర్ స్టార్.. గత 50,60 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాల్లో కొత్త పంథాను చూపించారు. రాజకీయాలపై ఆసక్తి లేని వారు కూడా ఈసారి జరిగిన ఏపీ ఎన్నికల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. దీనిబట్టి పవన్ ఏ రేంజ్‌లో వారిపై ప్రభావం చూపించాడో అర్థమయ్యే ఉంటుంది. కానీ ఈ స్థాయికి చేరుకోవడానికి పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలను.. ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఎన్నో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేశారు. రాజకీయాల్లో అడుగుపెట్టి జీరో నుంచి హీరోగా ఏదైనా పవర్ స్టార్ సెన్సేషనల్ ప్రయాణం ఇప్పుడు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఈ క్రమంలోనే తన విజయాలు, కష్టాల గురించి పవన్ కళ్యాణ్ తల్లి స్వయంగా ఇంటర్వ్యూలో వివరించింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ ఆ పని చేసినప్పుడు చాలా బాధగా అనిపించిందంటూ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని ఏంటో.. తల్లికి అంతగా బాధ కల్పించేలా ఆయన ఏం చేశారో అనే మ్యాటర్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తల్లి ఇంటర్వ్యూ ప్రోమో మాత్రమే రిలీజై నెటింట వైరల్‌గా మారింది. త్వరలోనే ఇంటర్వ్యూ ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ కానుంది అంటూ జనసేన పార్టీ అధికారికంగా అప్డేట్ ఇచ్చింది. ఈ ప్రోమో మీరు ఓ లుక్కేసేయండి.
“అమ్మ మనసు”
Full interview soon on JanaSena Party official YouTube channel :
– https://t.co/spri3sgwti pic.twitter.com/2YToTLZz4i
— JanaSena Party (@JanaSenaParty) October 1, 2024