ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే మొదటి భాగం ఇటీవల సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయిన సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. దాదాపు 400 కోట్ల భారీ బడ్జట్‌తో రూపొందిన ఈ మూవీమొదటి రోజే ఏకంగా రూ.172 కోట్లు కలెక్షన్ కొల్లగొట్టి తారక్ స్టామినా ఏంటో చూపించింది.
ఇక ఈ సినిమా ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లతో సంచలనాలు క్రియేట్ చేస్తుంది. దాదాపు 6 ఏళ్ళ తర్వాత ఏన్టీఆర్‌ను చూస్తున్న సోలో సినిమా కావడం.. కొరటాల శివ డైరెక్షన్‌లో సినిమా తెరకెక్కడంతో పాన్ ఇండియ లెవెల్‌లో అభిమానులంతా సినిమా కోసం ఎదురు చూశారు. ఇక ఈ దసరాకు భారీ సినిమాలేవి కూడా లేవు. దీంతో దేవరను ఆపేవారు లేరంటూ కలెక్షలతో ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇలాంటి క్రమంలో దేవర మూవీ టీంకు బిగ్ షాక్ తగిలినట్లు అయింది. సినిమా రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే హెచ్డి క్వాలిటీతో ఆన్లైన్లో ఫుల్ మూవీ ప్రింట్ వచ్చేసింది. దాదాపు మూడు గంటలు రెండు టైమ్‌తో సినిమా రాగా.. మూవీ మొత్తాన్ని ఆన్లైన్లో పెట్టడంతో టీంకు నిరాశ మిగిలింది. అసలే ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ రావడంతో సినిమాపై హైప్ ఎలా పెంచాలని సతమతమవుతున్న దేవర టీంకు.. ఈసారి పైరసీతో పెద్ద దెబ్బ తగిలింది. దీంతో వీటినుంచి మేకర్స్ ఎలా బయటపడతారనేది నెట్టింట చర్చనీయాంశంగా మారింది.