కోలీవుడ్‌లో హేమ కమిటీ నివేదిక ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ బయటకు వచ్చి తమకు జరిగిన చేదు అనుభవాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నటి పద్మప్రియ కూడా తన కెరీర్‌లో జరిగిన చేదు అనుభవాన్ని వివరిస్తూ కొన్నేళ్ల క్రితం తమిళ్ సినిమా సెట్ లో డైరెక్టర్ తనను పబ్లిక్ గా చంప దెబ్బ కొట్టాడంటూ వివరించింది. కానీ.. ఆ టైంలో మీడియా.. నాకు అనుగుణంగా లేదు తానే దర్శకుడు కొట్టినట్లు తప్పుగా రాసి ముద్రించారు అంటూ వివరించింది. మంగళవారం కేరళలోని కొలిక్‌కోడ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె పాల్గొంది.
తనే దర్శకుడిని కొట్టినట్లు మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవమని.. ఆ టైంలో తన వాదనను ఎవరు అసలు పట్టించుకోలేదంటూ వెల్లడించింది. మహిళలు తమ జీవితంలోని చేదు అనుభవాలను కొట్టి పడేయడం.. స్త్రీలనే తప్పుగా చూపించడం అనేది ఉందనడానికి తానే ఒక నిదర్శనం అంటూ వివరించింది. అయితే ఈ ఘటన తర్వాత డైరెక్టర్‌ని ఆరు నెలల పాటు సినిమాలు చేయకుండా పరిశ్రమ బ్యాన్ చేసిందని వివరించిన ఆమె.. ఆ తర్వాత తానే తమిళ్ సినిమాల్లో పాత్రలను రిజెక్ట్ చేస్తూ వచ్చానని చెప్పుకొచ్చింది.
అప్పటివరకు తనకు సినిమా సెట్స్‌పై ఎప్పుడు ఇలాంటి అవమానకర ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కాలేదని వెల్లడించింది. అయితే ఆ డైరెక్టర్ పేరు మాత్రం ఆమె వివరించలేదు. ఇక ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. శ్రీను వాసంతి లక్ష్మి సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పద్మప్రియ.. తర్వాత అందరి బంధువయ, పటేల్ సినిమాల్లోనూ కనిపించే ఆకట్టుకుంది. తర్వాత మలయాళ సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బ్యూటీగా మారిపోయింది.