ఐదో రోజు కూడా కలెక్షన్లతో దుమ్ము రేపుతున్న దేవర.. ఎంత వచ్చాయంటే..?

పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ ఎవైటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే .సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు రోజుల్లో ఏ రేంజ్‌లో కలెక్షన్లు కొల్ల‌గొట్టింది.. బ్రేక్ ఈవెన్ పరిస్థితి ఏంటో ఒకసారి తెలుసుకుందాం. దేవర మొదటి నాలుగు రోజుల్లో తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు వివరాలకు వెళ్తే మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ.73 కోట్లకు పైగా వ‌సూళ‌ను కొల్లగొట్టింది. రెండవ రోజు రూ.28 కోట్లకు పైగా.. మూడవరోజు రూ.28 కోట్లకు పైగా.. నాలుగవ‌ రోజు రూ.9 కోట్లకు పైగా నికర వసూళ‌ను సాధించి మంచి కలక్షన్‌లతో దూసుకుపోతుంది. దీంతో ఈ సినిమా ఈ నాలుగు రోజుల్లో ఏకంగా రూ.138 కోట్ల నికర వసూళ‌ను రాబట్టుకుంది. ఇక హిందీలో ఫస్ట్డే రూ. 7.5 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెండవ రోజు రూ.9 కోట్లు, మూడవ‌ రోజు రూ.11 కోట్లు, నాలుగవ‌ రోజు రూ.4 కోట్లు దక్కించుకుంది.

Devara - Trailer - 10th September 10:59 AM : r/tollywood

దీంతో నార్త్ బెల్ట్ లో దేవరకు రూ.32 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక తారక్ కెరీర్‌లో బాలీవుడ్‌లో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా దేవర నిలిచింది. అలా మొదటి నాలుగు రోజులు కర్ణాటకలో రూ.23 కోట్లు.. తమిళ్లో రూ.7 కోట్లు కేరళలో రూ.2 కోట్లు.. మిగతా రాష్ట్రాల్లో రూ.5 కోట్ల వసూళ‌ను దేవర సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాకు రూ.27 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇక దేవర ఇక్కడ కంటే ఓవర్సీస్‌లో ఎక్కువగా వసూళ్లను రాబ‌ట్ట‌డం విశేషం. నాలుగు రోజుల్లోనే 5.1 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.43 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టింది. ఈ సినిమా ఐదవ రోజున కూడా మంచి కలెక్షన్లను ద‌క్కించుకుంది. అలా ఐదవ రోజున 36 లొకేషన్ లో 52కే డాలర్లను దక్కించుకుంది. దీంతో ఈ సినిమా ఉత్తరా అమెరికాలో అదనంగా రూ.4 కోట్ల వసూళ‌ను సొంతం చేసుకుంది.

Janhvi Kapoor's South Debut with Devara Paired With Jr NTR! - Bollywood Dadi

యుఎస్, కెనడాలో రూ.47 కోట్ల వసూళ‌ను కొల్లగొట్టింది. ఓవర్సీస్ లో దేవర సినిమా విషయానికి వస్తే ఆస్ట్రేలియాలో మంచి ఆదరణ పొందుతుంది. అక్కడ ఈ సినిమా ఇప్పటికే 800కే ఆస్ట్రేలియన్ డాలర్లను సొంతం చేసుకుంది. యూకెలో 500 కే పౌండ్స్ దక్కించుకుంది. ఇలా పూర్తి థియేటర్లో ఈ సినిమా ఆ దేశాలలో వన్ మిలియన్ డాలర్లు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక నార్త్ అమెరికా ఇతర దేశాల్లో మొత్తంగా రూ.62 కోట్ల వరకు వస్తువులను కొల్లగొట్టింది. ఐదవ రోజు కలెక్షన్ల వివరాలకు వెళితే తెలుగు రాష్ట్రాల్లో రూ.9 కోట్లు ఇతర భాషల్లో రూ.4 కోట్లు వసూళ‌ను సొంతం చేసుకుంది. ఇక కేవలం హిందీలోనే రూ.5 కోట్ల వసూళ‌ను కొల్లగొట్టింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రూ.18 నుంచి రూ.20 కోట్ల మేర కలెక్షన్లను సాధించిన దేవర.. ప్రపంచవ్యాప్తంగా రూ.360 కోట్ల గ్రాస్ కలెక్షన్లను కొల్లగొట్టే అవకాశం ఉంది. మొదటి వారంలోనే ఈ సినిమా దాదాపు 400 కోట్ల వరకు కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా.