ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ప్రస్తుతం హీరోయిన్గా దూసుకుపోతుంది. అత్యధికమైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్‌లలో మొదటి వరుసలు నిలిచి దాదాపు 25 ఏళ్లగా సౌత్ స్టార్ హీరోయిన్గా చెరగని ముద్ర వేసుకొని వరుస సినిమాల్లో నటిస్తూ రాణిస్తుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ వరుస అవకాశాలను దక్కించుకుంటూ రాణిస్తుంది.
ఇక గతంలో మిస్ చెన్నై కిరీటాని దక్కించుకొని అందాల పోటీలోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. మోడలింగ్ రకంలోకి ఎంట్రీ ఇచ్చి తర్వాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. మొదట చిన్న చిన్న సినిమాల్లో నటిస్తునే తర్వాత స్టార్ హీరోయిన్గా మారి లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. తనే స్టార్ హీరోయిన్ త్రిష. సౌత్ లో తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న త్రిష.. 25 ఏళ్ల క్రితం నాటి ఫోటో సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది.
1999లో చెన్నై అందాల పోటీలో పాల్గొని ఆ పోఈలో విజయాని సాధించింది. మిస్ చెనై కిరీటం సొంతం చేసుకొని తాజాగా 25 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో ఈ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ.. తన జీవితాన్ని మార్చిన రోజు అది అంటూ ఫ్యాన్స్‌తో తన ఆనందాన్ని ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో అంత ఆశ్చర్యపోతున్నారు. త్రిష ఇప్పటికీ, అప్పటికి ఎంతగా మారిపోయిందో అంటూ అసలు గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.