చిరుతో లవర్ గా, భార్యగా, అక్కగా, అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న చిరంజీవి.. తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో ఆడి పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఒకప్పటి హీరోయిన్స్ నుంచి ఈ జనరేషన్ హీరోయిన్స్ వరకు.. ఎంతో మందితో నటించాడు చిరంజీవి. అయితే ఒక్క హీరోయిన్ మాత్రం చిరంజీవికి అక్కగా, లవర్ గా, భార్య‌గా, తల్లిగా ఇలా అన్ని పాత్రల్లోను నటించి మెప్పించింది. ఇంతకీ ఆమె ఎవరో చెప్పలేదు కదా.. తనే సీనియర్ నటి సుజాత.

తెలుగు తెరపై స్టార్ నటిగా మంచి ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళ, కన్నడలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మొదట హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించిన సుజాత.. తర్వాత అక్క, వదిన, అమ్మ ఇలా ఎలాంటి పాత్ర వచ్చిన వదులుకోకుండా నటించి ఆకట్టుకుంది. 1980లో కృష్ణంరాజు, చిరంజీవి కలిసి న టించిన మల్టిస్టారర్ మూవీ ప్రేమ తరంగాలలో సుజాత చిరంజీవి లవర్ గా నటించి ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చివర్లో వీరిద్దరు వివాహం చేసుకుంటారు. ఈ క్రమంలోనే సుజాత చిరంజీవికి భార్యగా కూడా మెప్పించింది. ఇక ఈ సినిమా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవా రీమేక్‌. ఇక ప్రేమతరంగాలు వచ్చిన రెండేళ్లకు సీతాదేవి సినిమాలో సుజాత మరోసారి చిరంజీవితో కలిసి నటించింది.

ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించి మెప్పించింది. సుజాత డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక 1995లో విజయ్ బాపినీడు డైరెక్షన్లో వ‌చ్చిన బిగ్‌బాస్ మూవీలో సుజాత చిరంజీవి తల్లిగా నటించి మెప్పించింది. ఈ సినిమాల్లో రోజా హీరోయిన్గా కనిపించింది. అయితే ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. అలా ఇప్పటివరకు చిరంజీవితో తల్లిగా, చెల్లిగా, ప్రేయసిగా, భార్య‌గా నటించిన ఏకైక హీరోయిన్ సుజాతనే కావడం విశేషం. అలా దాదాపు టాలీవుడ్ లో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరి సినిమాలోను నటించిన సుజాత.. తన చివరి రోజుల వరకు సినిమాల్లో నటిస్తూనే ఉంది. 2011 ఏప్రిల్ 6న ఈమె కన్నుమూశారు.