ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో నటి రోజా ఒకటి. తెలుగు, తమిళ్లో స్టార్ హీరోయిన్‌గా ఇమేజె సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కన్నడ భాషల్లోనూ నటించి మెప్పించింది. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాల్లో ఉన్న క్రమంలో చిరంజీవితోను పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అలా మెగాస్టార్‌తో ఎంతో ఇష్టంగా ఆడి పాడిన రోజా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంతలా దూషించి విమర్శలు చేయడానికి కారణం ఏంటి.. మరి ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్యన ఏవైనా మనస్పర్ధలు తలెత్తయ.. అంటూ పలువురులో సందేహాలు మొదలయ్యాయి. దానిపై ఓ సందర్భంలో రోజా రియాక్ట్ అవుతూ చిరంజీవిని అంతలా తాను తిట్టడానికి వెనుక కారణమేంటో ఓ సందర్భంలో వివరించింది.
ఇక చిరంజీవీ, రోజా ది సూపర్ హిట్ పెయిర్. వీరిద్దరి కాంబోలో ముఠామేస్త్రి, బిగ్ బాస్, ముగ్గురు మొనగాళ్లు సినిమాలు తెరకెక్కాయి. ఈ సినిమాలలో బిగ్‌బాస్ తప్ప.. మిగతా సినిమాలు రెండు బ్లాక్ బాస్టర్ సక్సెస్ అందుకున్నాయి. బిగ్ బాస్ ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేదు. అయితే రోజా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మాత్రం చిరంజీవిపై ఎన్నో ఘాటైన విమర్శలు చేసింది. ఈ క్రమంలో రోజకు ఓ ఆసక్తికర ప్రజలు ఎదురయింది. చిరంజీవికి మీకు మధ్యన ఏదైనా గొడవలు ఉన్నాయా.. అందుకే ఈ రేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారా అని రోజున ప్రశ్నించగా.. మా ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు లేవని.. సినిమాల్లో ఉన్నప్పుడు మేమిద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్.
తరచుగా నేను వాళ్ళ ఫ్యామిలీ వారిని కలుస్తూ ఉండే దాన్ని. ముఠామేస్త్రి సినిమా షూట్ టైంలో అయితే సుస్మిత, శ్రీజ, చరణ్ కూడా సెట్స్ లోకి వచ్చేవాళ్ళు.. నేను వాళ్ళని ఎత్తుకొని కూడా ఆడించా. ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక అక్కడ పాలసీలు, టర్ములకు అనుకూలంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోని చిరంజీవిని విమర్శించాల్సి వచ్చింది. అంతేకానీ ఆయనపై నేనెప్పుడూ వ్యక్తిగత దుషణలు చేయలేదు అంటూ రోజా చెప్పుకొచ్చింది. చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్.. జనసేన పార్టీని స్థాపించిన తర్వాత మెగాస్టార్ తో పాటు పవన్ కళ్యాణ్ పై ఎప్పటికప్పుడు విమర్శలు కురిపిస్తూనే ఉంది రోజా. ఎన్నోసార్లు నెగిటివ్‌గా రియాక్ట్ అవుతూ కించపరిచినట్లుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే వీటన్నిటికీ ప్రధాన కారణం అపోనెంట్ పార్టీలో రోజా ఉండడమేనట. ఇక రోజా ఇటీవల బుల్లితెరక కూడా పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.