నందమూరి కుటుంబానికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాది మంది అభిమానంతో స్టార్ హీరోగా దూసుకుపోతున్న నందమూరి హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. తారక్ నుంచి ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఆ సినిమాకు బ్రహ్మరథంపడతారు అనడంలో సందేహం లేదు. అలా తాజాగా ఎన్టీఆర్ నుంచి దేవర సినిమా రిలీజ్ అయింది. డివైడ్ టాక్ తోనూ కలెక్షన్ల పరంగా దుమ్ము రేపుతుంది. ఇప్పటికే రూ.350 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలోనే దేవర లాంగ్‌రన్‌లో దాదాపు రూ.600 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ అంచనాలు బ్రేక్ చేయడం ఎన్టీఆర్ కు చాలా చిన్న విషయం అన్నట్లుగానే ప్రేక్షకులు కూడా సినిమాకు ఎగబడుతున్నారు. నిజానికి ఈ సినిమా విషయంలో తారక్ చాలావరకు పొరపాట్లు చేశారని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నా.. మరి కొందరు మాత్రం సినిమా స్లో పాయిజన్‌లా జనాల్లోకి వెళుతుందని.. ప్రేక్షకులకు మెల్లమెల్లగా సినిమా నచ్చేస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొదటి డివైడ్ టాక్ వచ్చి తర్వాత సూపర్ హిట్గా ఇండస్ట్రియల్ హిట్గా నిలిచిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.
అలాగే దేవర కూడా మొదట డివైడ్ టాక్ వచ్చినా నిదానంగా సక్సెస్ టాక్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొనుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక తారక్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మొట్టమొదటి సోలో పాన్ ఇండియన్ సినిమా కావడంతో.. ఈ సినిమాతో తారక్ పాన్ ఇండియన్ మార్కెట్ మరింతగా పెరుగుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమా చివరకు సక్సెస్ టాక్ తెచ్చుకుంటే.. పాన్ ఇండియన్ మార్కెట్ పెరగడమే కాదు.. తర్వాత వచ్చే తారక్ సినిమాలపై కూడా విపరీతమైన అంచనాలు నెలకొంటాయి. ఇలాంటి క్రమంలో తారక్ దేవర లాంగ్ రన్‌లో ఎలాంటి కలెక్షన్లు అందుకుంటుందో ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో వేచి చూడాలి.