మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ అప్డేట్.. చిరు విశ్వంభరలో అకిరా..!

మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే మెగా హీరోలుగా ఎంతోమంది అడుగుపెట్టి ఇండ‌స్ట్రీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ వారసుడిగా ఆఖీరానందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని ఎప్పటి నుంచో అభిమానులు ఆరాటపడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ‌క ముందే ఆఖీరాకు మంచి ఫ్యాన్ పాలెం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆయన సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అంటూ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కాగా అకీరాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదని.. మ్యూజిక్ అంటే ఇష్టం అంటూ.. ఇప్పటికి అకీరా తల్లి రేణు దేశాయ్ క్లియర్ గా చెప్పేసింది. తన కెరీర్ ఏంటి అనేది తన నిర్ణయానికి ప్రాధాన్యత ఇస్తానని రేణు దేశాయ్ వెల్లడించింది.

Vishwambhara: “విశ్వంభర” రూమర్స్ పై క్లారిటీ కోరుకుంటున్న ఫ్యాన్స్ | Latest  Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

అయినా మెగా అభిమానులు మాత్రం ఆకిరా సినిమాల్లోకి రావాలని.. అతని హీరోగా చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి కోరిక నెరవేరబోతుందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సిల్వర్ స్క్రీన్ పై పవన్ వారసుడు కనిపించబోతున్నాడట. త్వరలో అకీరా హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడా అనే సందేహాలు అందరిలో రావచ్చు. కానీ.. అకీరా హీరోగా కాదు.. పెదనాన్న చిరంజీవి నటిస్తున్న విశ్వంభ‌ర సినిమాలో ఓ కీలక పాత్రలో మెరువనున్నట్లు సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ మ‌ల్లిడి వశిష్ట‌ డైరెక్షన్‌లో విశ్వంభ‌ర సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా దాదాపు 80 శాతం షూట్ ను పూర్తి చేసుకుందట.

Unseen PIC of Pawan Kalyan with wife Anna Lezhnev, kids Akira Nandan and  Aadya from his

అతిత్వరలో ఈ సినిమా షూట్‌కు గుమ్మడికాయ కొట్ట‌నున్నారని.. సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న క్రమంలో వివిధ భాష సినిమాల్లో నటిస్తున్న స్టార్ సెలబ్రిటీలను కూడా ఇందులో భాగం చేయనున్నారని సమాచారం. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడట. మనం సినిమాలో అఖిల్ ఎంట్రీ రేంజ్ లో విశ్వంభ‌ర‌లో ఆకిర ఎంట్రీ కూడా ఉండబోతుందని.. త్వ‌ర‌లోనే సినిమా షూట్ లో అకీరా పాల్గొంటారని వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.