రజనీకాంత్ కు అస్వస్థత.. హాస్పిటల్ లో జాయిన్ అయిన సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న రజినీకాంత్.. ఇటీవ‌ల‌ అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి చెన్నై అపోలో హాస్పటల్లో రజనీకాంత్ చేరారు. కడుపునొప్పి కారణంగా రజనీకాంత్‌ను హాస్పిటల్‌కు తరలించాల్సి వచ్చింది. అయితే ఆయన హాస్పిటల్‌కు చేరడానికి ముందే రజిని తాజా మూవీ వేట్టయ్యన్ ఆడియో లాంచ్ ఈవెంట్లో సందడి చేశారు.

రజనీకాంత్ vsబీజేపీ: నువ్వు కన్నడిగ, తమిళ సూపర్ స్టార్ ఎలా అయ్యావు, కావేరీ,  టాలెంట్ ! | It's BJP vs Superstar Rajinikanth now - Telugu Oneindia

ఈ కార్యక్రమంలో రజినీకాంత్ కొన్ని డ్యాన్స్ స్టెప్పులు కూడా వేసి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. 73 ఏళ్ల వయసులోను యంగ్ హీరోలా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకుంటున్న రజనీకాంత్.. సోమవారం రాత్రి ఆరోగ్యం క్షిణించ‌డంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చేరారు. అయితే ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ టీం అబ్జర్వేషన్‌లో రజనీకాంత్ ప్రస్తుతం ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్లు హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. ఇక హాస్పిటల్‌కి చేరకముందు రజనీకాంత్ పాల్గొని సందడి చేసిన వేట్టయ్యన్ మూవీ అక్టోబర్ 10న‌ గ్రౌండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది.

ఈ క్ర‌మంలో సినిమా ప్రమోషన్ కోసం రజనీ, అమితాబచ్చన్‌ల‌ వేట్టయ్యన్ ట్రైలర్.. రేపు (అక్టోబర్ 2న) గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈ సినిమా న్యూ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఇందులో రజిని డిఫ‌రెంట్ లుక్‌తో గాజులు వేసుకొని కనిపించాడు. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్.. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ టీంకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంటాడు. రజినీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. ఈ క్ర‌మంలో ఇద్దరు లెజెండ్స్ పవర్ఫుల్ నట‌న‌ను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా ప్రస్తుతం రజనీకాంత్ అస్వస్థతకు లోనయ్యారని తెలియడంతో.. అభిమానులు రజనీ త్వరగా కోలుకోవాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.