టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర మరికొద్ది గంటల్లో టాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ను పలకరించనుంది. ఈ క్రమంలో దేవర మ్యానియా విపరీతంగా కొనసాగుతుంది. ఆరేళ్ల తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆర్‌ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రానున్న క్రమంలో.. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తగ్గట్టుగానే అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండడం సినిమాపై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేసింది.
ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌లో కూడా సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎలా ఉంటుందా.. అనే ఆసక్తి ప్రేక్షకల్లో విపరీతంగా పెరిగిపోయింది. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అనిరుధ్ సంగీతం అందించడం.. సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనై రికార్డులు సృష్టిస్తున్నాయి. క్షణాల్లో హాట్ కేకులా టికెట్లు అమ్ముడుపోతూ్నాయి.
కాగా ఈ క్రమంలోనే సినిమా ఎన్ని థియేటర్లో ఆడుతుంది అనే అంశంపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్‌గా మారింది. దాదాపు 7వేలకు పైగా థియేటర్లలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారట. దీంతో ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఆ రికార్డును అందుకున్న సినిమాగా దేవర నిలవనుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 10,200 ధియేటర్లలో రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ సాధించారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెల్లవారుజామున 1:08 గంటలకు స్పెషల్ షోస్ వేసి ఓవర్సీస్ తో సమానంగా ప్రదర్శించేందుకు అంతా సిద్ధం చేశారు మేకర్స్.