అనుష్క లో ఉండే స్పెషల్ క్వాలిటీ అదే.. అందుకే అంత గౌరవిస్తారు..!

సినీ ఇండస్ట్రీలో లేడీస్ కు ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో.. మెయిల్ యాక్టర్స్ కు ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా ఆడవాళ్లకు గౌరవించే సెలబ్రిటీలు చాలా తక్కువ. బాలకృష్ణ, కమెడియన్ అని, చలపతిరావు, చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి వాళ్లు కూడా హీరోయిన్ల గురించి చీప్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టి వీరిని సినిమా ఇండస్ట్రీలో ఎలా ట్రీట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు. అయితే కొంతమంది హీరోయిన్లను మాత్రం ఎవ్వరు ఇప్పటికీ ఒక మాట కూడా అనరు. వారిని ఎంతో గౌరవంగా మాట్లాడుతుంటారు. ప్రేమగా, అభిమానంగా.. ఆదరిస్తారు. వారితో నటించిన ఇతర సినీ సెలబ్రిటీస్ ఆ హీరోయిన్లపై అభిమానాన్ని కురిపిస్తారు. అలాంటి లిస్టులోనే సాయి పల్లవి, నిత్యమీనన్ తో పాటు అనుష్క శెట్టి కూడా ఉంటుంది.

Baahubali actress Anushka Shetty reveals she has a rare laughing decease,  know more about the neurological condition 'Pseudobulbar'

ఇక తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షో రీసెంట్ ఎపిసోడ్లో థ‌మన్ అనుష్క శెట్టి మంచితనాన్ని గురించి తన మంచి మనసు గురించి వివరించాడు. ఇది అనుష్క ఇచ్చిందని.. ఐఫోన్ కొత్త సిరీస్ రిలీజ్ అయిన ప్రతిసారి కొత్త ఐఫోన్ తనకు అనుష్క పంపిస్తుందని వెల్లడించాడు. భాగమతి సినిమా టైంలో మేమిద్దరం కలిసి పని చేసాం. ఆ టైంలో అనుష్క తనకు ఓ మాట ఇచ్చిందంటూ చెప్పుకొచ్చాడు. ఆ మాట ప్రకారమే ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ ఎడిషన్ వచ్చినప్పుడల్లా.. తనకు గిఫ్ట్ చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక అమ్మడి నటన గురించి సినిమాలు, సక్సెస్ , పాత్రల్లో తన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అమ్మడి పర్సనల్ విషయానికి వస్తే తన వ్యక్తిత్వం చాలా మంచిదట. ఇదే విషయాన్ని మాట్లాడుతూ అనుష్క కనపడితే నేను, రవితేజ కలిసి కాళ్లు మొక్కుతామంటూ థ‌మన్ అమ్మడిని ఆకాశానికి ఎత్తాడు.

తమన్‌కి ఏడాదికో ఐఫోన్ గిఫ్ట్ ఇస్తున్న అనుష్క | SS Thaman Comments On  Anushka Shetty Gifting Iphones | Sakshi

ఒక నటిని ఇంత బాగా ప్రశంసించడం చాలా అరుదు. ఇక ఇక్కడ థ‌మన్ తన అందాన్ని కాదు.. మంచితనాన్ని మాత్రమే ప్రశంసించాడు. ఆమె అంత‌ల గౌరవించేలా.. అందరి మెప్పు పొందేలా ఆమెలో ఏదో స్పెషల్ ఎట్రాక్షన్ ఉందన్నట్లుగా థ‌మన్‌ వివరించాడు. అనుష్కతో ఇప్పటిదాకా చాలా గౌరవంగా అంతా వ్యవహరిస్తూ ఉంటారు. తనతో నటించిన వారంతా ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంటారు. అదే క్రమంలో అనుష్క గురించి ఇప్పటివరకు నెగిటివ్ వార్తలు ఏవి రాలేదు. డైరెక్టర్స్, నిర్మాతలు, హీరోలు ఇలా ఆమెతో పనిచేసిన ఎవరితోనూ ఇప్పటివరకు చిన్న గొడవైనా లేదు. అలాగే రూమర్స్ కూడా ఉండవు. ఈ క్రమంలో అనుష్క గురించి థ‌మన్‌ చేసిన కామెంట్స్ నటించే వైరల్ అవ్వడంతో.. అనుష్క‌ మనసు అంత మంచిది కాబట్టే.. తనను అందరూ అభిమానిస్తారు, గౌరవిస్తారు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.