టాలీవుడ్ బ్యూటిఫుల్ రీల్ కపుల్ లో మహేష్ బాబు, త్రిష జంట కూడా ఒకటి. ఈ జంట కెమిస్ట్రీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అతడు సినిమాలో వీరిద్దరూ కలిసి నటించిన సంగతి తెలిసిందే. తర్వాత గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన సైనికుడు సినిమాలోను వీరు మెప్పించారు. ఈ సినిమా ధియేటర్లో సరిగ్గా సక్సెస్ అందుకోకపోయినా.. బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా తర్వాత తెరకెక్కిన పోకిరి సినిమాలోని త్రిషను మొదట హీరోయిన్గా తీసుకోవాలని భావించారట. అయితే పూరి సినిమాలో కొత్తగా జంట కనిపించాలనే ఉద్దేశంతో ఇలియానాను సెలెక్ట్ చేసినట్లు టాక్. ఇక సైనికుడు సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. అయితే త్రిష, మహేష్ బాబు సినిమాల్లోకి రాకముందు నుంచే వీరిద్దరి మధ్య పరిచయం ఉండేదంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇంతకీ వీరిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది.. వీరి బాండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిష.. మహేష్ బాబు పై ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ సినిమాల్లోకి రాకముందే మేమిద్దరం ఒకరికి ఒకరు పరిచయం అంటూ యాంకర్ కు వివరించింది. ఈ క్రమంలో యాంకర్ మహేష్ బాబు పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ బాబు కూడా ఒకరిని.. ఎవరికి తెలియని విషయం ఏంటంటే కాలేజీలో చదువుకున్న డేస్ లోనే మా ఇద్దరికీ మంచి పరిచయం ఉందంటూ చెప్పుకొచ్చింది. చెన్నైలో చదువుకునే టైంలో ఇద్దరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడిందని.. త్రిష వివరించింది. ఫ్యూచర్లో యాక్టర్స్ అవుతామని ఇద్దరు అనుకోలేదని.. మాకు ఇవేవీ తెలియని కలిసినప్పుడు హాయ్ అని.. తర్వాత వెళ్లేటప్పుడు బాయ్ అని చెప్పుకునే వాళ్ళమని త్రిష చెప్పుకొచ్చింది.హీరోయిన్ అయిన తర్వాత ప్రిన్స్ తో కలిసి పనిచేసే టైం లో ఆయన ఎంత కష్టపడతాడో.. ఎంత సూపర్ స్టార్ అయినప్పటికీ అందరిని ఎలా గౌరవిస్తాడో చూస్తే నాకు ఆనందం అనిపించిందని.. తను నాకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకోచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు సెట్స్ లో ఉంటారు.. అందరి నటనను అబ్జర్వ్ చేస్తారు. మానిటర్ ముందు కూర్చుని షూటింగ్ మొత్తం ఓ లుక్ వేస్తారు అంతలా కష్టపడుతుంటే.. నాకు నిజంగా గిల్టీగా అనిపించేది.. అతని కష్టపడి తీరు నాకు చాలా స్ఫూర్తిదాయకం అంటూ త్రిష చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం త్రిష విశ్వంభర సినిమాలో చిరంజీవి సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్‌లో పాన్ వరల్డ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో మహేష్ బాబు – త్రిష కు సంబంధించిన ఈ న్యూస్ నెటింట తెగ వైరల్‌గా మారుతుంది.