మల్లీశ్వరి సినిమాలో నటించిన ఈ చిన్నది ఇప్పుడు సూపర్ హాట్ బ్యూటీ..?

దగ్గుబాటి వెంకటేష్.. తండ్రి రామానాయుడు సినీవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. ఒకప్పుడు సక్సెస్‌లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న వెంకీ.. దాదాపు అన్ని జార్నర్స్ లోనూ తన నటనతో ఆకట్టుకున్నాడు. త‌ను ఎంచుకున్న ప్ర‌తి కథతో ఆడియన్స్ను విప‌రీతంగా ఆకట్టుకున్నాడు. అలా వెంకటేష్ నటించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సినిమాల్లో మల్లీశ్వరి కూడా ఒకటి. కే.విజయభాస్కర్ డైరెక్షన్లో తెర‌కెక్కిన ఈ సినిమా 2004లో రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకీ కామెడీ టైమింగ్స్ సినిమాలో వేరే లెవెల్లో ఉంటుందన్నటంలో సందేహం లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ హీరోయిన్ గా మెప్పించింది.

ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా కోటి వ్యవహరించారు. సినిమాలోని పాటలన్నీ ఇప్పటికీ చాలామంది ప్లే లిస్ట్ లో ఉంటాయి. ఇక ఈ సినిమాలో దాదాపు అన్ని పాత్రలు ప్రేక్షకులను మెప్పించాయి. అలా వెంకి అన్న కూతురు పాత్రలో నటించిన బుజ్జి పాప గుర్తుందా.. తన క్యూట్ మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు పేరే గ్రీష్మ నేత్రిక. ఈ చిన్న‌ది మల్లేశ్వరి సినిమాతో పాటు అమ్ములు, అశోక్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ప్రస్థానం, పంచాక్షరి ఇలా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు హీరోయిన్ ఫీచర్స్ తో ప్రేక్షకులను టెంప్ట్ చేస్తుంది.

అమ్మడి తాజా లుక్‌ చూసిన నెటిజ‌న్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం గ్రీష్మ నేత్రికా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా కనిపించని ఈ అమ్మడు.. ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకోవాలని ఆసక్తి నెటిజ‌న్స్‌లో తప్పకుండా ఉంటుంది. ఈ క్రమంలోనే గ్రీష్మ లేటెస్ట్ పిక్స్ నెటింట‌ వైరల్ అవుతున్నాయి. అమ్మడి లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజ‌న్స్.. భలే హాట్ గా ఉందే.. హీరోయిన్స్ కూడా ఈ అమ్మడి అందం ముందు బలాదూర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.