ఈ ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ఇటీవల కాలంలో తెగ ట్రెండ్ అయిన ఈ అమ్మడు.. మొదట ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. నటనపై ఇంట్రెస్ట్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు సినిమాల్లో హీరోయిన్ గాను నటించింది. షార్ట్ ఫిలిమ్స్ లోను ఆకట్టుకుంది. ఇక ఇటీవల ఓ యంగ్ హీరోను వివాహం చేసుకొని కొత్త లైఫ్ ప్రారంభించింది. ఇంతకీ ఆ అమ్మడు ఎవరో కాదు.. రహస్య గోరక్. టాలీవుడ్ హీరో కిరాణా అబ్బవరంను.. రహస్య గోరక్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక 2012 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు పేరు ఐశ్వర్య గోరక్. కాగా రాజా వారు రాణి గారు సినిమాతో ఆమె పేరును రహస్యగా మార్చుకుంది. ఈ మూవీ షూట్ టైంలో కిరణ్ అభవరంతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఈ ఏడది ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్ లో ఈ జంట ప్రేమ వివాహంతో ఒకటయ్యారు.
అయితే రాజవారు రాణిగారు సినిమా కాకుండా.. ఈ అమ్మడు ఎన్నో సినిమాల్లో నటించింది. 2012లో మంచు విష్ణు, హన్సిక జంటగా నటించిన దేనికైనా రెడీ సినిమాలో ఓ స్మాల్ రోల్ ప్లే చేసిన ఐశ్వర్య.. ఇందులో మంచు విష్ణు కాలేజ్ క్లాస్మేట్ గా నటించి మెప్పించింది. తర్వాత పలు షార్ట్ ఫిలిమ్స్ తోను ఆకట్టుకుంది. హ్యాపీ ఎండింగ్ అనే షార్ట్ ఫిలింలో మెప్పించింది. 2016లో ఆకాశమంత షార్ట్ ఫిలిం తో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. 2017 లో వచ్చిన రెండు రెళ్ళ ఆరు సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ఆ సినిమాలోదే. అలాగే ప్రాంక్ అనే సినిమాలోను ఈ అమ్మడు నటించింది. కానీ.. సినిమా రిలీజ్ అయిన సంగతి కూడా చాలామందికి తెలియదు. అలాగే సాయి ధరమ్ తేజ్, కరుణాకర్ కాంబినేషన్ మూవీ.. తేజ్ ఐ లవ్ యు లో కూడా నటించింది.
అయితే అప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించిన ఆమెకు సక్సెస్ వచ్చింది మాత్రం రాజావారు రాణిగారు సినిమాతోనే. ఈ సినిమా అమ్మడుకు స్పెషల్ ఐడెంటిటీ ఇచ్చింది. తమిళ్లో కూడా ఖదీర్ హీరోగా నటించిన ఓ సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకుంది రహస్య గోరక్. 1994 మార్చి 26న హైదరాబాదులో జన్మించింది. తన చదువు పూర్తి చేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారింది. కొంతకాలానికి నటనపై ఇంట్రెస్ట్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఐశ్వర్య.. తర్వాత రహస్యగా పేరు మార్చుకుంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం భార్యగా కొత్త పేజీలోకి అడుగుపెట్టి తెగ ట్రెండ్ అవుతుంది. ఇక కిరణ్ ప్రస్తుతం కా సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పరికరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ కు ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.