బాలయ్యతో వరుస హిట్స్.. తారక్‌తో డిజాస్టర్స్.. మ్యాటర్ రివీల్ అయ్యిందిగా..!

తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఫుల్ ట్రెండ్‌లో నడుస్తున్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి వరకు ఫ్రాక్షన్ మూవీస్ అంటే కేవలం బాలయ్య పేరు మాత్రమే వినిపించేది. అలాంటి టైం లో ఆది సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు తారక్. ఈ క్రమంలో నందమూరి వంశానికి సరైన వారసుడు దొరికాడంటూ తారక్ పేరు తెగ వైరల్ గా మారింది. సింహాద్రి మూవీ ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌లో తెరకైకపోయినా ఈ సినిమాతోను ఇండస్ట్రియల్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు ఎన్టీఆర్. ఆ తర్వాత ఆయనకు అసలు పరీక్ష మొదలైంది. ఫ్యాక్షన్‌ సినిమాలు తీయడంలో డైరెక్టర్ బి. గోపాల్‌కు ఉన్న మార్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Jr NTR Bigger Than TDP, Balayya! | cinejosh.com

ఈ క్రమంలోనే బాలయ్యతో కలిసి సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి ఇండస్ట్రియల్ హిట్ సినిమాలను తెర‌కెక్కించాడు. అంతకు ముందు బాల‌య్య‌ హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న లారీ డ్రైవర్ కూడా వీరి కాంబోలో తెర‌కెక్కింది. ఇక అలా తన కథలతో బాల‌య్య‌కు వరుస బ్లాక్ బ‌స్ట‌ర్‌ సక్సెస్‌లు ఇచ్చిన బి.గోపాల్ ఎన్టీఆర్ విషయంలో మాత్రం వరుస డిజాస్టర్లను మిగిల్చాడు. తారక్.. బి గోపాల్ డైరెక్షన్ అసలు సెట్ కాలేదు. వీరి కాంబోలో వచ్చిన అల్లరి రాముడు, నరసింహుడు రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. అల్లరి రాముడు కొంతవరకు పర్లేదు అనిపించిన సెకండ్ హాఫ్ పూర్తిగా దెబ్బ తినడంతో డిజాస్టర్ టాక్‌ను సొంతం చేసుకున్నాడు.

B. Gopal – TOLLYWOOD CREW

ఇక ఇటీవల బి.గోపాల్ అల్ల‌రి రాముడు మూవీలో నగ్మా నడుము సన్నివేశంపై ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశాడు. తారక్.. నగ్మా నడుము పైకి ఎక్కడం లాంటి సన్నివేశాలు బాగా నవ్విస్తాయని.. ఆకుచాటు పిందె తడిచే సాంగ్ రీమిక్స్ కూడా చాలా ఆకట్టుకుందని వివరించాడు. ఫస్ట్ హాఫ్ బాగుందని.. కానీ సెకండ్ హాఫ్ కొంత డ్యామేజ్ జరగడం.. అలాగే అదే టైంలో ఇంద్ర సినిమా కూడా రిలీజ్ కావడం అల్లరి రాముడు కి పెద్ద మైనస్ గా మారిందని.. ఈ కారణంగానే తారక్ అల్ల‌రి రాముడు సక్సెస్ అందుకోలేకపోయిందంటూ వివరించాడు. ఇక బి.గోపాల్ నరసింహారెడ్డి సినిమా పై మాట్లాడుతూ ఈ సినిమాలో ఎలాంటి పాజిటివ్ అంశం లేదని.. అది స్టోరీ మొత్తం రాంగ్ అంటూ డైరెక్ట్‌గా రివీల్ చేశాడు. బాలయ్య కి వరస హిట్లు ఇచ్చిన నేను ఎన్టీఆర్ తో మాత్రం హిట్ సినిమా చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బీగోపాల్‌ చేసిన కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి.