వన్ వీక్ గ్యాప్ లోనే చిరు, తారక్ పోటి.. ఒకటి ఫ్లాప్, ఒక‌టి ఇండస్ట్రియల్ హిట్.. ఆ డైరెక్టర్ షాకింగ్‌ ఎక్స్పీరియన్స్.. ?

టాలీవుడ్ సీనియర్ స్టార్ డైరెక్టర్లలో బి.గోపాల్ ఒకడు. ఒకప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి బ్లాక్ బ‌స్టర్ సక్సెస్‌లు అందుకుని ఇండస్ట్రియల్ హిట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే బిగోపాల్ డైరెక్షన్‌లో పలు సినిమాలు తెర‌కెక్కి డిజాస్టర్‌గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఈమె లైఫ్ లో జరిగిన షాకింగ్ ఇన్సిడెంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. బి.గోపాల్ డైరెక్షన్ లోనే గతంలో తెర‌కెక్కిన రెండు సినిమాలు ఒకే ఒక్క వారం గ్యాప్ తో రిలీజై వైవిధ్యమైన రిజల్ట్‌ను అందుకున్నాయి.

ఆ రెండు సినిమాల్లో ఒకటి బిగ్గెస్ట్ డిజాస్టర్ కాగా మరొకటి ఇండస్ట్రియల్ హిట్గా నిలిచి కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి.. వాటి విశేషాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఆర్తిఅగర్వాల్ హీరోయిన్గా తెరకెక్కిన మూవీ అల్లరి రాముడు. ఈ సినిమాకు బి.గోపాల్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2002 జూలై 18న ఈ మూవీని గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ముందు భారీ హైప్‌ క్రియేట్ చేసుకున్నా.. రిలీజ్ అయిన తర్వాత నెగటివ్ టాక్ రావడంతో భారీ డిజాస్టర్ గా నిలిచింది. అసలు మూవీ ఆడియ‌న్స్‌ను ఆకట్టుకోలేకపోయింది.

Indra - ఇంద్ర Telugu Full Movie | Chiranjeevi | Aarthi Agarwal | Sonali  bendre | Telugu Movie studio - YouTube

అయితే ఇక బి.గోపాల్ డైరెక్షన్లోనే మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సోనాలి బింద్రే తో పాటు ఈ సినిమాలో కూడా ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించడం మరో విశేషం. ఇక ఈ సినిమా అదే ఏడాది జులై 24న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అప్పట్లో ఇండస్ట్రియల్ హిట్గా నిలిచి నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇలా బి.గోపాల్ డైరెక్షన్లో తెరకెక్కిన అల్లరి రాముడు, ఇంద్ర వారంగ్యాప్ తో రిలీజ్ అసలు ఊహించని రిజల్ట్ అందుకొని ఆయనకు షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి. ఇక ఆల్ టైం హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసిన ఇంద్ర.. ఇటీవల రీ రిలీజై మరోసారి తన ర్యాంపేజ్ ను చూపించిన సంగతి తెలిసిందే.