సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లుగా రాణించాలంటే కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఇంటిమేట్ సీన్లను నటించాల్సి ఉంటుంది. అయితే ఇంటిమేట్ సన్నివేశాలల్లో నటించడం.. నటి, నటులకు అంత సులువైన పనేంకాదు. అందరి ముందు షూట్‌లో రొమాన్స్ చేయడం అంటే అది సాధారణ విషయం కాదు. ఆ టైంలో తమని తాము నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. ఓ 42 ఏళ్ల హీరో గతంలో షూటింగ్ టైంలో అన్ని మర్చిపోయి సీన్‌లో ఇన్వాల్వ్ అయి 20 ఏళ్ల వయసు ఉన్న హీరోయిన్ పెదవిని గట్టిగా కొరికేసాడు. ఇంతకి ఇది ఏ సినిమాకు సంబంధించిన మ్యాటర్.. అసలు తర్వాత ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా లిప్‌లాక్‌లు హాట్ సనివేశాలు మితిమీరిపోతున్న సంగతి తెలిసిందే. కానీ.. ఈ సంఘటన మాత్రం ఇప్పటిది కాదు. 36 ఏళ్ల కిందట బాలీవుడ్ లో వచ్చిన సినిమాల్లో హీరో, హీరోయిన్ మధ్యన షూట్ రొమాన్స్ సీన్.. అప్పట్లో ఈ సంఘటన పై చాలా రచ్చ జరిగింది. ఇంతకీ ఈ సినిమా పేరు చెప్పలేదు కదా.. దయావన్. ఇందులో వినోద్ ఖన్నా, మాధురి దీక్షిత్ జంటగా నటించారు. అప్పటికి వినోద్ ఖన్నా వయసు 42 ఏళ్ళు. కాగా.. మాధురి దీక్షిత్ వయసు 27 ఏళ్లు. అప్పుడే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నంలో బిజీగా ఉంది.
మాధురి దీక్షిత్ ఈ సినిమాలో ఆజ్ ఫిర్ తుమ్‌సే అనే సాంగ్ షూట్‌లో వీరిద్దరి మధ్యన రొమాన్స్ సీన్ షూట్ చేయాల్సి ఉండగా.. అందులో హీరో, హీరోయిన్ మధ్య లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయి. ఆ సీన్ షూట్ చేసే టైంలో వినోద్‌ఖన్నా తన ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక.. మాధురి దీక్షిత్ పెదవిని గట్టిగా కొరికేశాడట. సీన్ ముగిసింది అని చెప్పిన అతను వినకుండా అలాగే కంటిన్యూ చేసినట్లు అప్పట్లో వార్తలు తెగ వైరల్‌గా మారాయి. అప్పటికి వినోద్ ఖన్నా బాలీవుడ్ లో స్టార్ హీరో కావడంతో అతను చేసిన పనికి షాక్ తిన్న మాధురి.. చాలా బాధపడిపోయిందట. ఆమె పెదవి కూడా కటై రక్తం కారడంతో.. అది తట్టుకోలేక ఏడుస్తూ ఉండిపోయిందట.
తర్వాత షూట్ కి వెళ్లడానికి కూడా అమ్మడు చాలా ఆలోచించిందట. ఈ క్రమంలో డైరెక్టర్ ఫిరోజ్ ఖాన్ రంగంలోకి దిగి అతనితో పాటు.. వినోద్ ఖన్నాను కూడా పిలిపించి మాధురికి క్షమాపణలు చెప్పించారట. దీంతో మళ్ళీ ఆమె షూటింగ్ చేయడానికి ఒప్పుకుంది. అయితే ఈ ఘటన మాత్రం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. ఇక ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి మరే సినిమాలోని నటించలేదు. ఈ దయామన్ తమిళ్, తెలుగులో సూపర్ సక్సెస్ అందుకున్న నాయకుడు మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. 1987లో రిలీజ్ అయిన నాయకుడులో కమలహాసన్ నటించాడు. అలాంటి నాయకుడు సినిమా రీమేక్ లో వినోద్ ఖన్నా, మాదిరి దీక్షిత్ నటించారు. అయితే తెలుగు, తమిళ్‌లో వచ్చిన సక్సెస్ మాత్రం బాలీవుడ్‌లో దక్కలేదు కానీ.. తర్వాత రోజుల్లో మాధురి దీక్షిత్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఎదిగి ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంది.